AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: వివాదంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. జాతీయ జెండాను అగౌరవపర్చాడంటూ విమర్శలు.. అసలు ఏమైందంటే?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. భారత జాతీయ జెండాను అగౌరవపర్చాడంటూ కొందరు నెటిజన్లు హిట్ మ్యాన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటిసున్నితమైన అంశాల పట్ల రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు

Rohit Sharma: వివాదంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. జాతీయ జెండాను అగౌరవపర్చాడంటూ విమర్శలు.. అసలు ఏమైందంటే?
Rohit Sharma
Basha Shek
|

Updated on: Jul 09, 2024 | 1:02 PM

Share

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. భారత జాతీయ జెండాను అగౌరవపర్చాడంటూ కొందరు నెటిజన్లు హిట్ మ్యాన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటిసున్నితమైన అంశాల పట్ల రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బార్బడోస్‌లో గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జాతీయ జెండాతో సంబరాలు చేసుకున్నాడు. ఈ వేడుకల మధ్య భారత జట్టు కెప్టెన్ కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని నాటేందుకు ప్రయత్నించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ సమయంలో అనుకోకుండా జెండా నేలను తాకింది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. రోహిత్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో అదే ఫొటోను తన ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకున్నాడు. దీని తర్వాత వివాదం మొదలైంది. చాలా మంది నెటిజన్లు టీమిండియా కెప్టెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోహిత్ ప్రొఫైల్ పిక్చర్ లో భారత త్రివర్ణ పతాకం నేలను తాకినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం ‘ఉద్దేశపూర్వకంగా జాతీయ జెండాను నేలను తాకకూడదు’ ఒక అభిమాని హిట్ మ్యాన్ పై ఆగ్రహం వ్యక్త చేశాడు. ఈ విషయం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా తెలియదా అని మరొకరు ప్రశ్నించారు. ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని కొందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

వివాదానికి కారణమైన ఫొటో ఇదే..

ఓవరాల్ గా రోహిత్ శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలో త్రివర్ణ పతాకం నేలను తాకినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చాలా మంది టీమ్ ఇండియా కెప్టెన్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జాతీయ జెండాను గౌరవించాలని సూచిస్తున్నారు. అలాగే తన ప్రొఫైల్ పిక్చర్ నుండి ఆ ఫోటోను వెంటనే తొలగించాలని కూడా కోరుతున్నారు. మరి ఈ వివాదంపై రోహిత్ శర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

విక్టరీ పరేడ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!