- Telugu News Photo Gallery Cricket photos Team India’s Suryakumar Yadav Visits Udupi Marigudi Temple With His Wife, See Photos
Suryakumar Yadav: నెరవేరిన ప్రపంచకప్ కల.. భార్యతో కలిసి ఉడిపి ఆలయంలో మొక్కులు తీర్చుకున్న సూర్య కుమార్.. ఫొటోస్
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం ఉడిపిలో పర్యటించారు. తన సతీమణి దేవిషా శెట్టితో కలిసి ఉడిపికి వచ్చిన అతను స్థానికంగా ఉండే కాపులోని మరిగుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
Updated on: Jul 09, 2024 | 1:34 PM

టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం ఉడిపిలో పర్యటించారు. తన సతీమణి దేవిషా శెట్టితో కలిసి ఉడిపికి వచ్చిన అతను స్థానికంగా ఉండే కాపులోని మరిగుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

టీ20 ప్రపంచకప్‌కు ముందు, సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టు ట్రోఫీని గెలవాలని కోరిక కోరుకున్నాడు. ఇప్పుడిది నెరవేరడంతో మొక్కులు తీర్చుకునేందుకు కాపులోని మరిగుడి ఆలయాన్ని సందర్శించాడు సూర్య. ఈ సందర్భంగా భార్యతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

ఉడిపి ఆలయాన్ని సందర్శించిన సూర్యకుమార్ దంపతులను ఆలయ నిర్వాహకులు సన్మానించారు. మరోవైపు భారత జట్టు ప్లేయర్‌కు తగిన భద్రత కల్పించేందుకు మరిగుడి పరిసరాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మంగళవారం ఉడిపికి వచ్చిన సూర్యకుమార్, దేవిషాలు మరిగుడి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఉడిపికి విచ్చేసిన సూర్యకుమార్ యాదవ్ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ టీ20 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 10 భారీ సిక్సర్లు, 15 ఫోర్లతో మొత్తం 199 పరుగులు చేశాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ అద్భుత క్యాచ్‌తో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించింది.

సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి స్వస్థలం మంగళూరు. ముంబైలో ఉంటూ దేవిషా, సూర్య ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని 2016లో పెళ్లి చేసుకున్నారు.




