- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: KKR Has Approached Rahul Dravid For The Mentor's Post in IPL 2025 Says Reports
IPL 2025: ఐపీఎల్ 2025లో రాహుల్ ద్రవిడ్ సరికొత్త ఇన్నింగ్స్.. ఆ జట్టుకు మెంటార్‌గా ఫిక్స్?
Rahul Dravdi - Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కేకేఆర్ టీమ్‌కు మెంటార్‌గా ఉన్న గంభీర్ టీమిండియాకు వెళుతుండగా.. టీమ్ ఇండియా నుంచి తప్పుకున్న ద్రవిడ్‌ను ఆకర్షించేందుకు కేకేఆర్ సిద్ధపడడం విశేషం.
Updated on: Jul 09, 2024 | 4:21 PM

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తదుపరి ప్రయాణం ఎటువైపు? ఈ ప్రశ్నకు ప్రస్తుత సమాధానం ఐపీఎల్ మెంటార్ అని తెలుస్తోంది. అంటే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ద్రవిడ్‌ను మెంటార్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ భారత ప్రధాన కోచ్ కావడం దాదాపు ఖాయం. దీని తరువాత, షారుక్ ఖాన్ యాజమాన్యంలోని KKR ఫ్రాంచైజీ మెంటార్ పదవి కోసం టీమిండియా మాజీ కోచ్ ద్రవిడ్‌ను సంప్రదించినట్లు తెలిసింది.

అంతకుముందు రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌కు మెంటార్‌గా పనిచేశాడు. కాబట్టి ఈ పోస్ట్ అతనికి కొత్త కాదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజయ శిఖరాలకు చేర్చిన ద్రావిడ్‌ను మెంటార్‌గా నియమించేందుకు KKR చాలా ఆసక్తిగా ఉందంట.

అయితే రాహుల్ ద్రవిడ్ నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదు. KKR ఫ్రాంచైజీ ఆఫర్‌ను అంగీకరిస్తే, IPL 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ది గ్రేట్ వాల్ మెంటార్‌గా కనిపించే అవకాశం ఉంది.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం 89 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్.. 11 అర్ధ సెంచరీలతో మొత్తం 2174 పరుగులు చేశాడు. అతను 2014, 2015లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మెంటార్‌గా కూడా పనిచేశాడు. అందుకే రాహుల్ ద్రవిడ్ కేకేఆర్ జట్టుకు కొత్త మెంటార్‌గా కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.




