- Telugu News Photo Gallery Cricket photos The Australian government plans to build the world's first all weather Indoor Cricket Stadium
Indoor Cricket Stadium: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై వర్షం కురిసినా టెన్షన్ వద్దు.. కొత్త క్రికెట్ స్టేడియం చూశారా?
Australia: ఆస్ట్రేలియాలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి నిర్మించే స్టేడియం పైకప్పు ఉండడం విశేషం. అంటే గతంలో ఉన్న మెల్‌బోర్న్ డాక్‌లాండ్స్ స్టేడియం కంటే భిన్నంగా ఆల్-వెదర్ స్టేడియంను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Updated on: Jul 09, 2024 | 4:59 PM

ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-వెదర్ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ స్టేడియం అతి ముఖ్యమైన లక్షణం పైకప్పుతో ఉండడమే. అదేంటంటే.. వర్షం కురిసినా మ్యాచ్‌ల నిర్వహణకు అనువుగా ఉండే ఇండోర్ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని ఆస్ట్రేలియా ప్రారంభించింది.

గతంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మెల్‌బోర్న్‌లో మార్వెల్ స్టేడియంను నిర్మించింది. ఈ స్టేడియంలో పైకప్పు కూడా ఉంది. కానీ, ఈ రూఫింగ్ స్టేడియం మ్యాచ్‌ల కోసం నిర్మించలేదు. అలాగే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు చాలాసార్లు బంతి పైకప్పునకు తగిలేది. ఇప్పుడు ఈ మైదానాన్ని ఇతర క్రీడలకు ఉపయోగిస్తున్నారు.

క్రికెట్ మ్యాచ్‌లకు అనువుగా ఉండే ఆల్ వెదర్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. ఈ స్టేడియం డిజైన్‌లు ఇప్పుడు లీకయ్యాయి. పైకప్పు గోళాకార ఆకారంలో గాజుతో అందించారు. తద్వారా ఉదయం కూడా మ్యాచ్ నిర్వహించవచ్చు. అలాగే వర్షం కురుస్తున్నప్పటికీ మ్యాచ్ సజావుగా సాగనుంది.

స్టేడియం 23,000 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. క్రికెట్ కాకుండా ఇతర క్రీడల కోసం ఉపయోగించేందుకు అనువుగా ఈ స్టేడియాన్ని డిజైన్ చేశారంట. దీని ద్వారా, ఆల్-వెదర్ క్రికెట్ స్టేడియంలో ఎల్లప్పుడూ క్రీడా కార్యకలాపాలు జరిగేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది.

దీని గురించి కాక్స్ ఆర్కిటెక్చర్ సీఈఓ అలిస్టర్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ.. అన్ని వేళలా క్రికెట్ ఆడేందుకు వీలుగా ఈ స్టేడియం డిజైన్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా దాని పైకప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త స్టేడియం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించి 2028 నాటికి ప్రారంభించనున్నామని తెలిపారు.



















