- Telugu News Photo Gallery Cricket photos Team India's Smriti Mandhana and composer Palash Muchhal celebrate 5 years of relationship
Smriti Mandhana: ముక్కలైన కుర్రాళ్ల మనసులు.. లవర్‌ను పరిచయం చేసిన స్మృతి మంధాన.. ఎవరీ పలాశ్ ముచ్చల్?
స్మృతీ మంధాన.. అటు ఆటతోనూ, ఇటు అందంతోనూ యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ టీమిండియా క్రికెటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే స్మృతి తాజాగా షేర్ చేసిన ఒక పోస్టును చూసి కుర్రాళ్ల హృదయాలు ముక్కలైపోయాయి.
Updated on: Jul 09, 2024 | 9:51 AM

స్మృతీ మంధాన.. అటు ఆటతోనూ, ఇటు అందంతోనూ యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ టీమిండియా క్రికెటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే స్మృతి తాజాగా షేర్ చేసిన ఒక పోస్టును చూసి కుర్రాళ్ల హృదయాలు ముక్కలైపోయాయి.

ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ తో ఉన్న తన ప్రేమ బంధాన్ని స్మృతి మంధాన అధికారికంగా ప్రకటించడమే ఇందుకు కారణం.

తమ ఐదేళ్ల రిలేషన్ షిప్ కు గుర్తుగా స్మృతితో కలిసి కేక్ కట్ చేస్తోన్న ఫొటోలను షేర్ చేశాడు పలాశ్ ముచ్చల్. తన ఫొటోలకు ‘ఐదు’’ అంటూ హార్ట్ ఎమోజీ జత చేశాడు

తమ ప్రేమ బంధానికి ఐదు వసంతాలు నిండాయన్న అర్థంలో క్యాప్షన్ జతచేశాడు పలాశ్. దీనికి టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కూడా స్పందించింది.

పలాశ్ ముచ్చల్ పోస్టుకు స్మృతి మంధాన లవ్ సింబల్స్‌తో రిప్లై ఇచ్చింది. తద్వారా తమ ప్రేమ బంధాన్ని అధికారికం చేశారీ లవ్ బర్డ్స్.

ప్రస్తుతం స్మృతి, పలాశ్ ముచ్చల్ ల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు క్యూట్ జంట అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.