- Telugu News Photo Gallery Cricket photos Team India Players Jaiswal, Samson and Chahal to Get Rs 5 Crore Prize Money without playing a match in T20 World Cup 2024
Team India: ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే రూ. 5 కోట్లు.. లిస్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు.. ఎవరంటే?
T20 World Cup 2024: ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి 2 కోట్లు దక్కనున్నాయి. అదేవిధంగా భారత జట్టుకు ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పొందుతారు. ఇలా రూ. 125 కోట్లను టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుతో కలిసి కనిపించిన ప్రతి ఒక్కరికీ పంచనున్నారు.
Updated on: Jul 08, 2024 | 4:21 PM

టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా ఆటగాళ్లు బీసీసీఐ నుంచి రూ.125 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. ఈ ప్రైజ్ మనీ మొత్తం టీమ్‌తో పంచుకోనున్నారు. అంటే ఇక్కడ రూ. 125 కోట్ల మొత్తంలో ఎవరికి ఎంత వాటా వస్తుందో వెల్లడైంది.

దీని ప్రకారం టీమ్ ఇండియా ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. భారత జట్టులో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజువేంద్ర చాహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంటే వీరు ముగ్గురు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. అంటే భారత జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడికి రూ.5 కోట్లు దక్కనున్నాయి. అంటే జట్టులోని మొత్తం 15 మంది ఆటగాళ్లకు సమాన మొత్తం దక్కనుంది. ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ కూడా రూ.5 కోట్లు అందుకోనున్నారు.

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు ఇవ్వనున్నారు. అదేవిధంగా ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన ఇతర కోచింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు లభించనున్నాయి.

ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి 2 కోట్లు దక్కనున్నాయి. అదేవిధంగా భారత జట్టుకు ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పొందుతారు. ఇలా రూ. 125 కోట్లను టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుతో కలిసి కనిపించిన ప్రతి ఒక్కరికీ పంచనున్నారు.




