Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. వేలాది మందికి సాయం.. అసలు విషయం చెప్పిన కాస్ట్యూమ్ మాస్టర్..

ఇప్పటికే ప్రభాస్ మంచితనం, మనస్తత్వం గురించి చాలా మంది స్టార్స్ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. అలాగే సెట్ లో ఉండే ప్రతిఒక్కరి ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తీసుకువస్తాడన్నా సంగతి తెలిసిందే. తాజాగా కల్కి సినిమాకు కాస్ట్యూమ్ మాస్టర్ గా పనిచేసిన మురళి అనే వ్యక్తి ప్రభాస్ చేసిన సాయం గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. వేలాది మందికి సాయం.. అసలు విషయం చెప్పిన కాస్ట్యూమ్ మాస్టర్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 10, 2024 | 11:41 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ డార్లింగ్ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. బాక్సాఫీస్ కింగ్ అయినా.. ప్రభాస్ మంచితనం గురించి తెలిసిందే. ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం. కష్టాల్లో ఉన్నవారికి ఎన్నోసార్లు సాయం చేసి వారికి అండగా నిలబడ్డాడు. అభిమానులకు, సినీ కార్మికులకు తనవంతు సాయం చేస్తూ ఎక్కడ పబ్లిసిటీ లేకుండా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటాడు. ఇప్పటికే ప్రభాస్ మంచితనం, మనస్తత్వం గురించి చాలా మంది స్టార్స్ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. అలాగే సెట్ లో ఉండే ప్రతిఒక్కరి ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తీసుకువస్తాడన్నా సంగతి తెలిసిందే. తాజాగా కల్కి సినిమాకు కాస్ట్యూమ్ మాస్టర్ గా పనిచేసిన మురళి అనే వ్యక్తి ప్రభాస్ చేసిన సాయం గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా జూన్ 27న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు చేరులో ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికీ కల్కి మూవీని చూసి ఆశ్చర్యపోతున్నారు మూవీ లవర్స్.ఇక ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రభాస్ రూ.10 వేలు బహుమతిగా ఇచ్చారట. వేలాది మందికి రూ. 10 వేలు చొప్పున సాయం చేశాడట. తాజాగా ఈ విషయాన్ని మురళి అనే కాస్ట్యూమ్ మాస్టర్ బయటపెట్టాడు.

కల్కి సినిమాకు అన్ని డిపార్ట్మెంట్స్ లో పనిచేసిన ప్రతి ఒక్కరి పేరు తెలుసుకుని.. వారి అకౌంట్లో రూ.10 వేలు వేశారని అన్నారు. ఇంతవరకు ఇలాంటి హీరోను తానెప్పుడు చూడలేదని అన్నాడు. అలాగే షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు అందరికి అద్భుతమైన భోజనం అందించారని.. డార్లింగ్ నిజంగా గ్రేట్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ మంచితనంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.