Kalki 2898 AD OTT: ప్రభాస్ ‘కల్కి’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్!

భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.900 కోట్లు దాటేసిన ప్రభాస్ సినిమా రూ. 1000 కోట్ల మార్క్ కు అతి చేరువలో ఉంది. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ కల్కి సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. నాగ్ అశ్విన్ టేకింగ్, ప్రభాస్, అమితాబ్, దీపికల యాక్టింగ్, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ కల్కి సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది

Kalki 2898 AD OTT: ప్రభాస్ 'కల్కి' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ స్పెషల్ డే నుంచే స్ట్రీమింగ్!
Kalki 2898 AD Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 10, 2024 | 9:18 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జానర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. ఇలా భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.900 కోట్లు దాటేసిన ప్రభాస్ సినిమా రూ. 1000 కోట్ల మార్క్ కు అతి చేరువలో ఉంది. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ కల్కి సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. నాగ్ అశ్విన్ టేకింగ్, ప్రభాస్, అమితాబ్, దీపికల యాక్టింగ్, గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ కల్కి సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో జనాలు థియేటర్లలకు పరుగుల పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తోన్న కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ సొంతం చేసుకున్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఒక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

ఇదిలా ఉంటే థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు 7-8 వారాల తర్వాతే కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ముందే డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి ‘కల్కి’ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది సినిమాను చూసే అవకాశముంది. కాబట్టి ఓటీటీ సంస్థలు కూడా ఈ తేదీనే లాక్ చేయనున్నాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరికొన్ని రోజులు ఆగితే కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!