AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plot OTT: ఆ ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

హీరో వికాస్ ముప్పాల హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమాకు అంతగా ప్రచారం జరగలేదు. దీంతో అటు పాజిటివ్ రివ్యూస్ వచ్చినా.. అంతగా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. డైరెక్టర్ భాను భావ తార్కక దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Plot OTT: ఆ ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Plot Movie
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2024 | 11:04 AM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, హారర్ కంటెంట్ చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కొన్నాళ్లుగా సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తీసుకువస్తున్నారు మేకర్స్. అదే ప్లాట్. యంగ్ హీరో వికాస్ ముప్పాల హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమాకు అంతగా ప్రచారం జరగలేదు. దీంతో అటు పాజిటివ్ రివ్యూస్ వచ్చినా.. అంతగా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. డైరెక్టర్ భాను భావ తార్కక దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ మూవీ జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. మరో రెండు రోజుల్లోనే ఓటీటీలో అడియన్స్ ముందుకు రాబోతుంది. కర్నూలులోని ఎమ్మిగనూర్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఈ మూవీలో వికాస్ ప్రధాన పాత్రలో నటించగా.. గాయత్రి గుప్తా కథానాయికగా నటించింది. ఇందులో సంజీవ్ పసల, కిశోర్, సంతోష్ నందివాడ కీలకపాత్రలు పోషించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మెప్పించారు. ఈ చిత్రానికి కార్తిక్ రోడ్రిగ్డ్ సంగీతం అందించారు.

ప్లాట్ కథ విషయానికి స్తే.. ఎమ్మిగనూరులో రాహుల్ (వికాస్ ముప్పాల) వ్యాపారంలో ఫెయిలై ఉంటాడు. అటు అతడి ప్రేయసి.. దీపు (గాయత్రి) డ్రగ్స్ డీలర్.. హైదరాబాద్ లో ఓ వ్యక్తిని హత్య చేస్తుంది. దీంతో అతడి సోదరుడు సమీప్ దీపును వెతుకుంటాడు. ప్రేయసితో కలసి విదేశాలకు వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తారు. కానీ అనుకోకుండా సమీర్ ను చంపేసి ఓ స్థలంలో పాతేస్తారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాహుల్ ఎదిగిన తర్వాత ఓ అపరిచిత వ్యక్తి నుంచి బ్లాక్ మెయిల్స్ వస్తుంటాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ? రాహల్ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది..? అనేది సినిమా. ఈ మూవీ ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!