AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్.. స్క్రీన్‌పై కనిపిస్తే చాలు నవ్వులే.. గుర్తు పట్టారా?

పై ఫొటోలోని పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్. తెరపై ఇతని ముఖం కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులే నవ్వులు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడం ఈ కమెడియన్ స్టైల్.

Tollywood: ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్.. స్క్రీన్‌పై కనిపిస్తే చాలు నవ్వులే.. గుర్తు పట్టారా?
Tollywood Comedian Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 10, 2024 | 2:30 PM

Share

పై ఫొటోలోని పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్. తెరపై ఇతని ముఖం కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులే నవ్వులు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడం ఈ కమెడియన్ స్టైల్. ఇక డైలాగులు చెప్పడంలోనూ, టైమింగ్ లోనూ అయితే నెక్ట్స్ లెవెల్. అందుకే బ్రహ్మానందం తర్వాత తెలుగు సినిమాల్లో ఖాళీ అయిన ప్లేస్ ను ఈ నటుడితోనే భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే అందరి కంటే ఎక్కువగానే పారితోషకం తీసుకుంటున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టే ఈ హాస్య నటుడు ఇటీవలే హీరోగా మారాడు. ఒక స్పై మూవీతో మన ముందుకు వచ్చాడు. అయితే సినిమా పెద్దగా క్లిక్ కాలేదు. కానీ ఈ స్టార్ కమెడియన్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయిందని రివ్యూలు వచ్చాయి. అందుకే థియేటర్లలో ఆకట్టుకోని ఆ మూవీ ఓటీటీలో దుమ్ము రేపింది. మరి ఫొటో చూసి ఆ పిల్లాడెవరో గెస్ చేయగలరా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ. ఈ కమెడియన్ నటించిన మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. యస్. అతను మరెవరో కాదు వెన్నెల కిశోర్.

ఇవి కూడా చదవండి

దేవా కట్టా తెరకెక్కించిన వెన్నెల సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వెన్నెల కిశోర్. అంతకు ముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. మొదటి సినిమాతోనే ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన వెన్నెల కిశోర్ ఆ తర్వాత తన ట్యాలెంట్ తో టాలీవుడ్ లో టాప్ మోస్ట్ కమెడియన్ గా ఎదిగాడు. ‘వెన్నెల 1 1/2’ అంటూ ఆ మధ్యన ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించినా పెద్దగా క్లిక్ కాలేదు. ఇప్పుడు హీరోగానూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. చారి 111 సినిమా నిరాశనే మిగిల్చినా ఇప్పుడు మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అదే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఇందులో అనన్య నాగళ్ల హీరోయిన గా నటిస్తోంది.

జిమ్ లో కసరత్తులు చేస్తోన్న కమెడియన్ వెన్నెల కిశోర్..

చారి 111 సినిమాలో హీరోగా వెన్నెల కిశోర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం