AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: విజయ్‌తో నటించిన ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో కోలీవుడ్ స్టార్ హీరోతో ఉన్న ఛైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే గ్లామర్ షోకు, స్కిన్ షోకు ఈ నటి చాలా దూరం. అందుకే ఈ అమ్మడికి సినిమా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి.

Tollywood: విజయ్‌తో నటించిన ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Thalapathy Vijay
Basha Shek
|

Updated on: Jul 11, 2024 | 1:25 PM

Share

పై ఫొటోలో కోలీవుడ్ స్టార్ హీరోతో ఉన్న ఛైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే గ్లామర్ షోకు, స్కిన్ షోకు ఈ నటి చాలా దూరం. అందుకే ఈ అమ్మడికి సినిమా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. అయితేనేం.. వచ్చిన సినిమాల్లోనే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. చాలా మంది లాగే ఈ అమ్మడు పెళ్లి వార్తలు తరచూ వైరల్ అవుతుంటాయి. అలా ఈ మధ్యన కూడా ఈ హీరోయిన్ పెళ్లి రూమర్లు బాగా వైరలయ్యాయి. వీటిని చూసి విసుగు చెందిన ఈ ముద్దుగుమ్మ అందరి ముందే ‘అవును నాకు పెళ్లయింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు’ అంటూ తన సినిమాను ప్రమోట్ చేసింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్..ఆ అమ్మాయి మరెవరో కాదు టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా థామస్. కాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది నివేదా థామస్.

తమిళ, మలయాళంలోని పలువురి స్టార్ హీరోలతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా థామస్. . విజయ్ దళపతి హీరోగా నటించిన కురువి అనే సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. పై ఫొటో కూడా ఆ సినిమాలోని స్టిల్. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమాలో నటిస్తోంది నివేదా థామస్.

ఇవి కూడా చదవండి

ఇందులో ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. . తిరుపతి నేపథ్యంలో దర్శకుడు నందకిశోర్‌ ఇమాని ఈ సినిమా తెరకెక్కించారు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్