Harish Shankar: కంగ్రాట్స్.. నువ్వు కనిపెట్టావ్.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్..
మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల మంచి క్యూరియాసిటీ నెలకొంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
డైరెక్టర్ హరీశ్ శంకర్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌కు కాస్త్ బ్రేక్ పడింది. మరోవైపు మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల మంచి క్యూరియాసిటీ నెలకొంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
సితార్ అంటూ సాగే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అలాగే పాటలోని లిరిక్స్ కూడా శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ పాటలో రవితేజ, హీరోయిన్ భాగ్య శ్రీ కెమిస్ట్రీ.. బ్యూటీఫుల్ స్టెప్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సాంగ్ బాగుందంటూ కామెంట్స్ వస్తుండగా.. కొందరు నెటిజన్స్ మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్లను కేవలం వస్తువులాగే చూపిస్తారని మండిపడుతున్నారు.
తాజాగా నెటిజన్ సితార్ పాటపై రియాక్ట్ అవుతూ.. 56 ఏళ్ల రవితేజతో కేవలం 25 ఏళ్ల హీరోయిన్ భాగ్య శ్రీ స్టెప్పులు వేయడం.. అలాగే హీరోయిన్ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యం అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ రియాక్ట్ అవుతూ.. “కంగ్రాట్స్.. ఇది నువ్వు కనిపెట్టినందుకు. నువ్వు నోబెల్ ఫ్రైజ్ కు దరఖాస్తు చేసుకో.. అలాగే నువ్వు దీనిని కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్ ను ప్రశ్నిస్తూ ఉండాలి. నీలాంటి వారికి ఎప్పుడూ వెల్ కమ్ చెబుతూనే ఉంటాను” అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
Congratulations for the discovery.. i think you should apply for Nobel Prize… 👍👍 And pls continue objectifying film makers…. We welcome you https://t.co/g6J2pR0NXK
— Harish Shankar .S (@harish2you) July 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.