- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Fame Ashwini Sree Participates In Hyderabad Bonalu Festival, See Photos
Ashwini Sree: బోనమెత్తిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎల్లమ్మ తల్లికి అశ్విని శ్రీ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
హైదరాబాద్ లో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. తాజాగా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ పట్టుచీరలో బోనం సమర్పించింది.
Updated on: Jul 13, 2024 | 1:27 PM

హైదరాబాద్ లో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. తాజాగా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ పట్టుచీరలో బోనం సమర్పించింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గ్లామరస్ బ్యూటీ అశ్విని శ్రీ ఒకరు. ఈ బ్యూటీ తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న సినిమాల్లో నటించింది అశ్విని. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచుకోలేకపోయింది.

ఆ తర్వాత బిగ్ బాస్‌లో అవకాశం అందుకుంది. తన గేమ్ కు గ్లామర్ అద్ది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార.

నిత్యం తన గ్లామరస్ ఫొటోలు, జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంటాయి.

తాజాగా సంప్రదాయ పట్టుచీర ధరించి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించింది అశ్విని శ్రీ. ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.