- Telugu News Photo Gallery Cinema photos Why are there no minimum booking for Bollywood star hero films?
Bollywood Audience: బాలీవుడ్ ఆడియన్స్ కల్కికి పట్టం.. వారి స్టార్ హీరోల సినిమాలకు నో.. రీజన్ అదేనా.?
కల్కి చూసిన కళ్ళతో బాలీవుడ్ ఆడియన్స్ ఇంకే సినిమాలు చూడట్లేదా.. లేదంటే వాళ్లసలు సినిమాలు చూడటం మానేసారా..? స్టార్ హీరోల సినిమాలకు కనీస బుకింగ్స్ ఎందుకు ఉండట్లేదు..? ప్రభాస్ సినిమాలు చూడ్డానికి థియేటర్స్‌కు వస్తున్న ఆడియన్స్.. అక్కడి హీరోలకు మాత్రం ఎందుకు హ్యాండిస్తున్నారు..? ఓటిటి కారణంగా కలెక్షన్లు రావట్లేదా..? అసలు సమస్య ఎక్కడుంది..?
Updated on: Jul 13, 2024 | 1:37 PM

ప్రపంచమంతా కరోనా నుంచి బయటపడింది ఒక్క బాలీవుడ్ తప్ప. అదేంటి అలా అంటున్నారు.. ఇంకెక్కడి కరోనా అనుకోవచ్చు..! కానీ బాలీవుడ్ దర్శక నిర్మాతల ఆలోచన ఇంకా అక్కడే ఆగిపోయింది.

ఆడియన్స్ కూడా వాళ్లకు తగ్గట్టుగానే ఆలోచిస్తున్నారు. అందుకే 2024లోనూ నేరుగా ఓటిటిలోనే విడుదలవుతున్నాయి కొన్ని సినిమాలు.. థియేటర్‌లో వచ్చిన సినిమాలకేమో ఓపెనింగ్స్ రావట్లేదు.

చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్‌కు కళ తీసుకొచ్చిన సినిమా కల్కి. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి హిందీలో కూడా ఇప్పటికే 220 కోట్లు వచ్చాయి. 2024లో హైయ్యస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా ఇదే. ఫైటర్‌ను దాటేసి ఈ రికార్డ్ అందుకుంది కల్కి. అయితే ఇదే రెస్పాన్స్ బాలీవుడ్ హీరోల సినిమాలకు రావట్లేదు.

మొన్నటికి మొన్న స్వాంతంత్య్ర నేపథ్యంలో తెరకెక్కిన ఏ వతన్ మేరే వతన్ సినిమా నేరుగా ఓటిటిలోనే వచ్చింది. సారా అలీ ఖాన్‌తో పాటు చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు ఈ సినిమాలో. దానికి ముందు షాహిద్ కపూర్ బ్లడీ డాడీ.. సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను.. వరుణ్ ధవన్ భవాల్.. ఇషాన్ ఖట్టర్ పిప్పా లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ కాకుండా ఓటిటిలోనే వచ్చాయి.

తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా సుధ కొంగర తెరకెక్కించిన సర్‌ఫిరా జులై 12న విడుదల అయింది. ఆకాశమే నీ హద్దురా రీమేక్ ఇది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ బానే చేశారు.. కానీ బుకింగ్స్ విషయానికి వచ్చేసరికి కనీసం 5 కోట్లు కూడా లేవు. అక్షయ్ గత సినిమా బడేమియా ఛోటేమియా కూడా బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.




