- Telugu News Photo Gallery Cinema photos Alia Bhatt Wears 160 Year Old Silk Saree At Ananth Ambani and Radhika Merchant's Wedding
Alia Bhatt: అంబానీ పెళ్లిలో 160 ఏళ్ల నాటి చీర ధరించిన అలియా.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వివాహ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రెటీలు, సౌత్, నార్త్ స్టార్స్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రిఫ్రెష్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది.
Updated on: Jul 13, 2024 | 6:24 PM

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది.

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వివాహ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రెటీలు, సౌత్, నార్త్ స్టార్స్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రిఫ్రెష్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. రోటీన్ కు భిన్నగా చీరకట్టులో కనిపించింది అలియా.

సాంప్రదాయ చీరకట్టులో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది అలియా. అనంత్, రాధిక పెళ్లికి విచ్చేసిన అతిథుల కళ్లన్నీ అలియా చీరపైనే వాలిపోయాయి. పాతకాలపు సాంప్రదాయకమైన విధానంలో అలియా కనిపించింది.

అనంత్, రాధిక పెళ్లి కోసం అలియా కట్టుకున్న చీర 160 ఏళ్ల నాటిది. ఈ చీర డిజైన్ కోసం నిజమైన బంగారం, వెండిని ఉపయోగించారని తెలిసింది. ఈ వేడుకలో భర్త రణబీర్ కపూర్ తో కలిసి ఎథ్నిక్ వేర్ లో అల్టిమేట్ పవర్ కపుల్ గా కనిపించారు అలియా.

160 ఏళ్ల క్రితం నేసిన ఆశావళి చీర గుజరాత్ లో స్వచ్చమైన పట్టు 99 శాతం స్వచ్చమైన వెండితో కూడిన నిజమైన జరీ బార్డర్ తో రూపొందించింది. ఈ చీరలో అద్భఉతమైన రీగల్ లుక్ అందించడానికి సుమారు 6 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారు.




