- Telugu News Photo Gallery Cinema photos Actress nayanthara new Black dress glamorous photos goes attract in social media on July 2024
Nayanthara: గ్లామర్ డోస్ పెంచిన నయనతార.. బాలీవుడ్ గాలి సోకినట్టు ఉందా.?
బాలీవుడ్ వెళ్లిన తర్వాత ఎవరైనా అక్కడి కల్చర్‌కు అలవాటు పడాల్సిందే. అలా కాదు.. మేం ఇలాగే ఉంటాం.. మాలాగే ఉంటాం అంటే అక్కడ కుదరదు. నయనతార కూడా దీనికి మినహాయింపేమీ కాదు. జవాన్ తర్వాత ఈమెకు కూడా బాలీవుడ్ గాలి సోకింది. దాంతో ఎప్పుడూ లేనిది ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు నయన్. మరి ఈమెలో వచ్చిన మార్పుకు కారణమేంటి..? సాధారణంగా మూవీ ప్రమోషన్స్‌కు మాత్రమే కాదు.. ఫోటోషూట్స్‌కు కూడా దూరంగానే ఉంటారు నయనతార.
Updated on: Jul 13, 2024 | 7:07 PM

బాలీవుడ్ వెళ్లిన తర్వాత ఎవరైనా అక్కడి కల్చర్‌కు అలవాటు పడాల్సిందే. అలా కాదు.. మేం ఇలాగే ఉంటాం.. మాలాగే ఉంటాం అంటే అక్కడ కుదరదు. నయనతార కూడా దీనికి మినహాయింపేమీ కాదు. జవాన్ తర్వాత ఈమెకు కూడా బాలీవుడ్ గాలి సోకింది.

దాంతో ఎప్పుడూ లేనిది ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు నయన్. మరి ఈమెలో వచ్చిన మార్పుకు కారణమేంటి..? సాధారణంగా మూవీ ప్రమోషన్స్‌కు మాత్రమే కాదు.. ఫోటోషూట్స్‌కు కూడా దూరంగానే ఉంటారు నయనతార.

ఎంత పెద్ద హీరోతో నటించినా కూడా ప్రమోషన్స్ వైపు చూడరు. ఎక్కడివరకో ఎందుకు.. జవాన్ ప్రమోషన్స్‌లోనూ నయన్ కనిపించలేదు. దాంతో బాలీవుడ్ వెళ్లినా.. నయన్ పద్దతులు మార్చుకోలేదని అర్థమైంది.

కానీ తనకు అలవాటు లేని ఫోటోషూట్స్‌పై ఫోకస్ చేసారిప్పుడు. తాజాగా నయనతార ఫోటోషూట్ వైరల్ అవుతుంది. చాలా రోజుల తర్వాత హీట్ పెంచేసారు నయన్. అసలు ఈ మధ్య సినిమాల్లో కూడా గ్లామర్ షోకు దూరంగా ఉన్నారు ఈ సీనియర్ హీరోయిన్.

పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పరిమితమైపోయారు. జవాన్‌లోనూ పెద్దగా గ్లామర్ షో చేయలేదు నయన్. కానీ జవాన్ తర్వాత నయన్ 2.0 కనిపించారు. మెల్లగా డోస్ పెంచేస్తున్నారు.

ఉన్నట్లుండి నయనతార ఇలా రెచ్చిపోవడం వెనక రీజన్ బాలీవుడ్ అని అర్థమవుతుంది. జవాన్ తర్వాత అక్కడ్నుంచి ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అంతేకాదు.. సినిమాకు 15 కోట్లు ఆఫర్ చేస్తున్నారు నిర్మాతలు.

మిస్ లీడ్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎవరికైనా అనుమానాలుంటే, ఈ పోస్టు చూడమంటూ నయన్ కూడా ఓ లింక్ షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అవుతోంది.




