AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Chinmayi: ‘మీలో ఆ దమ్ముందా?’ ముచ్చుమర్రి హత్యాచార ఘటనపై సింగర్ చిన్మయి రియాక్షన్.. వీడియో రిలీజ్

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేశారు. అనంతరం శవం కూడా దొరకకుండా ఎత్తి పోతల అప్రోచ్ కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన జరిగి నేటికి వారం రోజులు అవుతోంది. కానీ బాలిక మృత దేహం మాత్రం ఇంతవరకు కనిపించలేదు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Singer Chinmayi: 'మీలో ఆ దమ్ముందా?' ముచ్చుమర్రి హత్యాచార ఘటనపై సింగర్ చిన్మయి రియాక్షన్.. వీడియో రిలీజ్
Singer Chinmayi
Basha Shek
|

Updated on: Jul 14, 2024 | 1:48 PM

Share

నంద్యాల జిల్లా మైనర్ బాలిక హత్యాచారా ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేశారు. అనంతరం శవం కూడా దొరకకుండా ఎత్తి పోతల అప్రోచ్ కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన జరిగి నేటికి వారం రోజులు అవుతోంది. కానీ బాలిక మృత దేహం మాత్రం ఇంతవరకు కనిపించలేదు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ దారుణ ఘటనపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఈ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను కఠినంగా శిక్షించాలని కోరింది. తాజాగా ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ హత్యాచార ఘటనపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారామె. ఇందులో డార్క్ కామెడీ , మీమ్స్ , ట్రోల్స్ చేసే వారిపైనా విరుచుకుపడింది. తద్వారా ప్రణీత్ హనుమంతు లాంటి యూట్యూబర్లను ఏ మాత్రం ఎంకరేజ్ చేయవద్దంటూ సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

“రేప్‌ లు చేసే వారిని చూసి అందరూ మండిపడుతున్నారు. కానీ మన పక్కనే ఉంటూ అడల్ట్ జోక్స్ వేసే వారిని మాత్రం అసలు నిలదీయలేకపోతున్నాం. ఇలాంటి మీమ్స్ , ట్రోల్స్, జోక్స్ ఎందుకు వేస్తున్నారని అడిగే దమ్ము మన దగ్గర లేకపోయింది. ఒకవేళ ఇలాంటి వాటి మీద స్పందిస్తే మాత్రం యాంటీ నేషనల్ , ఫెమినిస్ట్ , అర్బన్ నక్సల్స్ అంటూ విమర్శిస్తారు. మూడో తరగతి చదువుతున్న ఆడబిడ్డ మీద మైనర్ బాలురు చేసిన హత్యాచార ఘటన మీద అందరూ రియాక్ట్ అవుతున్నారు. అయ్ సభ్య సమాజం ఎటు పోతోంది.. ఏమైపోతోంది.. పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దు.. పిల్లలకు ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేయాలని అంటున్నారు. దురదృష్టవ శాత్తూ అలాంటి వారే మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అడల్ట్ కామెడీ, మీమ్స్, ట్రోల్స్, డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తున్నారు’ అని వీడియోలో చెప్పుకొచ్చింది చిన్మయి.

ఇవి కూడా చదవండి

అలాగే వీడియో చివరలో ఓ మీమ్ ను, దానికి వచ్చిన కామెంట్లను కూడా చూపించింది చిన్మయి. “ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేశారు. ఇలా కామెంట్లు చేసే వారు మన చుట్టూ చాలా మందే ఉంటారు.. వారిని ప్రశ్నించే గట్స్, దమ్ము ఉందా? పైగా చదువుకున్న వారే ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు’ అంటూ ఫైరయ్యిందీ సింగర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.