Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఆమె వాయిస్‏కు పాన్ ఇండియానే ఫిదా..

తండ్రి నిర్మాత..కాగా తల్లి అప్పట్లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతో ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా.. ?

Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఆమె వాయిస్‏కు పాన్ ఇండియానే ఫిదా..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 14, 2024 | 1:31 PM

ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించినవారు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. స్టార్ హీరోస్ సినిమాలో బాలనటీనటులుగా కనిపించి ఆ తర్వాత చదువు రీత్యా ఇండస్ట్రీకి దూరమయ్యారు. గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి కూడా చిన్నప్పుడు అనేక చిత్రాల్లో నటించింది. తండ్రి నిర్మాత..కాగా తల్లి అప్పట్లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతో ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా.. ? తనే హీరోయిన్ కీర్తి సురేష్. ఈ బ్యూటీ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత. తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్. 2000లోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కీర్తి. మూడు సంవత్సరాలు ఇండస్ట్రీలోనే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ డిగ్రీ పూర్తి చేసి మలయళంలో గీతాంజలి సినిమా ద్వారా కథానాయికగా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న కీర్తి.. తెలుగులో రామ్ పోతినేని సరసన నేను శైలజ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించింది.

మహానటి సినిమాలో కీర్తి నటన గురించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మైమరపించింది. ఈ చిత్రంలో కీర్తి నటకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఈ మూవీతో సక్సెస్ అయిన కీర్తికి ఆ తర్వాత మాత్రం తన ప్రతిభకు తగిన అవకాశాలు రాలేదు. కేవలం గ్లామర్ రోల్స్ చిత్రాలే వచ్చాయి. సఖి, మిస్ ఇండియా, గుడ్ లక్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించినప్పటికీ కీర్తికి సరైన ఆఫర్స్ రాలేదు. హీరోయిన్ పాత్రలే కాకుండా స్టార్ హీరోలకు చెల్లిగానూ కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ సినిమాల్లో చెల్లెలి పాత్రలు పోషించింది. ప్రస్తుతం కీర్తి హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.