- Telugu News Photo Gallery Cinema photos Varalaxmi Sarathkumar shares wedding happy moments her husband Nicholai Sachdev, See Photos
Varalaxmi Sarathkumar: థాయ్‌లాండ్ బీచ్ వేదికగా ఏడడుగులు.. వరలక్ష్మి కళ్లల్లో ఆనందం చూశారా? పెళ్లి ఫొటోస్
ప్రముఖ టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. థాయ్‌లాండ్ వేదికగా జులై 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
Updated on: Jul 14, 2024 | 11:57 AM

ప్రముఖ టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. థాయ్‌లాండ్ వేదికగా జులై 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు వరలక్ష్మి వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

పెళ్లి అనంతరం చెన్నైలోని తాజ్ హోటల్ లో ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్నికూడా జరిపించారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు పలువురు సినీ, రాజకీల ప్రముఖులు హాజరయ్యారు

కాగా పెళ్లి కార్యక్రమాలు ముగిసిన వెంటనే హనీమూన్ కు వెళ్లిపోయారు వరలక్ష్మి- సచ్ దేవ్ దంపతులు. ఈ నేపథ్యంలో తమ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది వరలక్ష్మి.

అలాగే తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోందీ అందాల తార. అలా తాజాగా వరలక్ష్మి షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇందులో వరలక్ష్మి- నికోలాయ్ సచ్ దేవ్ జంట చాలా అందంగా కనిపించింది. అలాగే థాయ్ ల్యాండ్ బీచ్ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.





























