AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ విగ్రహం.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ పాపులారిటీ, ఫాలోయింగ్ ను గమనించిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీసుకున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ కు వెళ్లిపోయాడు రామ్ చరణ్. అక్కడ తన శరీరానికి సంబంధించిన కొలతలను ఇచ్చినట్టు సమాచారం.

Ram Charan: మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ విగ్రహం..  స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Ram Charan
Basha Shek
|

Updated on: Jul 16, 2024 | 12:38 PM

Share

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. తనదైన నటన, డ్యాన్సులు, ఫైట్లతో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇందులో అతను చేసిన డ్యాన్సులు, ఫైట్స్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి. ఇలా సినిమాల్లో గ్లోబల్ స్టార్ గా ఓ రేంజ్ లో వెలిగిపోతోన్న రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కనుందని సమాచారం. అదేంటంటే.. లండన్ లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ పాపులారిటీ, ఫాలోయింగ్ ను గమనించిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీసుకున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ కు వెళ్లిపోయాడు రామ్ చరణ్. అక్కడ తన శరీరానికి సంబంధించిన కొలతలను ఇచ్చినట్టు సమాచారం.

కాగా మేడమ్ టుస్పాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసే రామ్ చరణ్ మైనపు విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉండనున్నట్లు. అదేమిటంటే.. రామ్‌చరణ్‌ ఫ్రెంచ్‌ బార్బేట్‌ జాతికి చెందిన కుక్క పిల్ల రైమ్‌ను తనతో పెంచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా రైమ్‌ను తీసుకెళ్లడం రామ్‌చరణ్‌ దంపతులకు అలవాటు. అందుకే ఇప్పుడు కూడా రైమ్‌ను ఎత్తుకుని ఉన్న రామ్‌చరణ్‌ మైనపు బొమ్మనే మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఇవి కూడా చదవండి

అనంత్ అంబానీ పెళ్లిలో బాబాయితో రామ్ చరణ్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో తండ్రికొడుకులుగా చెర్రీ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అటు రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు చరణ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం