- Telugu News Photo Gallery Cinema photos Actress Sohini Sarkar and Shovan Ganguly tie the knot, Share Photos
Sohini Sarkar: ప్రేమ వివాహం చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మ్యూజీషియన్‌తో కలిసి ఏడడుగులు.. ఫొటోస్
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. గత ఏడాది కాలంగా ఓ మ్యూజీషియన్ తో ప్రేమలో మునిగి తేలుతోన్న ఆమె తాజాగా అతనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.
Updated on: Jul 16, 2024 | 12:08 PM

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. గత ఏడాది కాలంగా ఓ మ్యూజీషియన్ తో ప్రేమలో మునిగి తేలుతోన్న ఆమె తాజాగా అతనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బెంగాలీ చిత్రపరిశ్రమను కూడా టాలీవుడ్ అని అంటారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సోహిని సర్కార్.. మ్యూజీషియన్ షోవన్ గంగూలీని పెళ్లి చేసుకుంది.

సోమవారం (జూలై 15) సోహిని- షోవన్ గంగూలీల పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సోహిని.. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది.

ఇందులో నూతన వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ప్రస్తుతం సోహినీ సర్కార్ పెళ్లి ఫొటోలు సామాజి మాధ్యమాల్లో వైరవుతున్నాయి.

2013 నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సోహిని సర్కార్ పలు సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీసుల్లో హీరోయిన్‌గా చేసింది. ఇదే సమయంలో గతేడాది ఓ పార్టీలో మ్యూజీషియన్ సోవన్ గంగూలీని కలిసింది

తొలుత మంచి ఫ్రెండ్స్ అయ్యారు సోహినీ- సోవన్. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.