- Telugu News Photo Gallery Cinema photos Actor Suriya in another new experimental movie with Dulquer Salmaan also starring in it
Suriya: ప్రయోగమే నా బలం అంటున్న స్టార్ హీరో.. మరో సరికొత్త ఎక్స్‌పెర్మెంట్ వస్తున్న సూర్య
కలిసొస్తాయని కలలు కని చేసిన కమర్షియల్ సినిమాలేమో హ్యాండిచ్చాయి. అందుకే అప్పట్లో తనకు కలిసొచ్చిన ప్రయోగాల వెంటే వెళ్తున్నారు ఓ స్టార్ హీరో. కొన్నేళ్లుగా వరస మాస్ సినిమాలు చేస్తూ.. ఫ్లాపులు అందుకున్న ఆయన.. వాటికి కొన్నాళ్లు ఫుల్ స్టాప్ పెట్టి ప్రయోగాల బాట పట్టారు. తాజాగా మరో డిఫెరెంట్ సినిమాతో రాబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరో.. చూద్దామా..? సూర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు.
Updated on: Jul 16, 2024 | 11:55 AM

ఇలా ప్రతిదీ సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతోంది. థియేటర్లలోనూ ఇదే స్థాయిలో సినిమా కిర్రాక్ అనిపిస్తే కలెక్షన్ల వర్షం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్.

సూర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే మార్కెట్ ఈయన సొంతం. కాకపోతే ఆ మార్కెట్‌కు సరిపోయే సినిమాలే ఈ మధ్య రావట్లేదంతే. ఇప్పటికీ సూర్య రేంజ్‌కు తగిన సినిమా పడితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్‌లో రోలెక్స్ కారెక్టర్‌ను చూస్తే చాలు.

ఈయన జోరు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఎంత వేగంగా సినిమాలు చేస్తున్నా.. ఒక్క విషయంలో వెనకే ఉన్నారు సూర్య. సూర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు.

ప్రస్తుతం ఈయన మాస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. కంగువా లాంటి భిన్నమైన సినిమాతో వస్తున్నారు. శివ తెరకెక్కిస్తున్న కంగువాపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. అలాగే సుధా కొంగరతో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు సూర్య. ఇందులో దుల్కర్ సల్మాన్ మరో హీరో.

తాజాగా ఈ చిత్ర షూట్ పూర్తైంది. ఇందులో సూర్య లుక్ పుష్పలో అల్లు అర్జున్‌ను గుర్తు చేస్తుంది. దీని తర్వాత కమెడియన్ కమ్ డైరెక్టర్ RJ బాలాజీతో ఓ సినిమా చేయబోతున్నారు సూర్య. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే.. మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య.




