- Telugu News Photo Gallery Cinema photos Will Vishwak Sen do movie with director Krishna Chaitanya after Nithiin and Sharwanand rejected story
Vishwak Sen: ఇద్దరు హీరోలు వద్దన్న సినిమా..విశ్వక్ చేయబోతున్నారా ??
అప్పుడెప్పుడో ఆగిపోయిన ఆ సినిమాను విశ్వక్ సేన్ చేయబోతున్నారా..? సెన్సేషనల్ పొలిటికల్ సబ్జెక్ట్‌కు ఈ మాస్ హీరో ఓకే చెప్పారా..? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రాజకీయాలు బాగానే చేసిన విశ్వక్.. మరోసారి అలాంటి కథలో కనిపించబోతున్నారా..? ఇద్దరు హీరోలు వద్దన్న సినిమాను ఇప్పుడు విశ్వక్ టేకప్ చేయబోతున్నారా..? ధమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ విశ్వక్ సేన్ జర్నీ బాగానే ఉందిప్పుడు.
Updated on: Jul 16, 2024 | 11:51 AM

అప్పుడెప్పుడో ఆగిపోయిన ఆ సినిమాను విశ్వక్ సేన్ చేయబోతున్నారా..? సెన్సేషనల్ పొలిటికల్ సబ్జెక్ట్‌కు ఈ మాస్ హీరో ఓకే చెప్పారా..? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రాజకీయాలు బాగానే చేసిన విశ్వక్.. మరోసారి అలాంటి కథలో కనిపించబోతున్నారా..? ఇద్దరు హీరోలు వద్దన్న సినిమాను ఇప్పుడు విశ్వక్ టేకప్ చేయబోతున్నారా..?

ధమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ విశ్వక్ సేన్ జర్నీ బాగానే ఉందిప్పుడు. రివ్యూలతో పని లేకుండా.. టాక్‌తో సంబంధం లేకుండా విశ్వక్ సినిమాలకు కలెక్షన్లు అయితే బాగానే వస్తున్నాయి. ప్రతీ సినిమాకు నిర్మాత బాగానే సేఫ్ అవుతున్నారు. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు విశ్వక్ సేన్ పేరు పరిశీలిస్తున్నారు.

లిరిసిస్ట్ కమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య చాలా రోజుల కింద పవర్ పేట అనే సినిమాను అనౌన్స్ చేసారు. నితిన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. 2 పార్ట్స్ అని ప్రకటించారు కూడా. అయితే చివరి నిమిషంలో పవర్ పేట ఆగిపోయింది. ఆ తర్వాత శర్వానంద్ అనుకున్నారు కానీ అది కూడా వర్కవుట్ అవ్వలేదు. ఈ గ్యాప్‌లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసారు కృష్ణ చైతన్య.

పవర్ పేట పూర్తిగా పొలిటికల్ యాక్షన్ డ్రామా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ రాజకీయాలు బాగానే ఉంటాయి. ఇందులో విశ్వక్ సేన్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. దాంతో తన పవర్ పేటను విశ్వక్‌తో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు కృష్ణ చైతన్య. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది.

విశ్వక్ సేన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. మెకానిక్ రాఖీతో పాటు లైలా సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయ్యాకే మరో సినిమాపై ఫోకస్ చేస్తారు. ఆ లోపు కృష్ణ చైతన్య పవర్ పేట సబ్జెక్ట్ విశ్వక్‌కు తగ్గట్లు మార్చగలిగితే ఈ ప్రాజెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి చూడాలిక.. నితిన్, శర్వానంద్ కాదన్న కథలో విశ్వక్ కనిపిస్తారా లేదా అని..!




