- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda plans to do movies one by one instead of doing many at a time
Vijay Devarakonda: ప్లాన్ మొత్తం మార్చేసిన విజయ్ దేవరకొండ.. కొత్త ఫార్ములా అప్లై చేస్తున్న రౌడీ బాయ్
ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారీయన. సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది.
Updated on: Jul 16, 2024 | 11:46 AM

ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారీయన. సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..?

విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. అప్పట్లో వరస విజయాలతో రయ్‌మంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్‌కు ఈ మధ్య కాలం అస్సలు కలిసిరావడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా బెడిసికొడుతున్నాయి.

ఖుషీ ఓకే అనిపించింది అనుకుని ఆనందించేలోపే.. ఫ్యామిలీ స్టార్ దెబ్బ పడిపోయింది. తాజాగా కల్కిలో అర్జునుడిగా మెరిసారు విజయ్. ఫ్యామిలీ స్టార్ ఫలితం చూసాక విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి.

గతంలో లైగర్ చేస్తున్నపుడే ఖుషీకి.. అది సెట్స్‌పై ఉన్నపుడే గౌతమ్ సినిమాకు.. అది పూర్తికాక ముందే ఫ్యామిలీ స్టార్‌కి ఓకే చెప్పారు విజయ్. ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ వద్దు.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు రౌడీ బాయ్. 2 సినిమాలు ఫైనల్ అయినా.. నిదానమే ప్రధానం అంటున్నారు.

కొన్ని సినిమాలు అంతే.. అందులో యాక్ట్ చేసిన వారికి అందరికీ ఓవర్‌నైట్‌లో పేరు తెచ్చిపెట్టేస్తాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో వాళ్లని పాపులర్ చేసేస్తాయి. ఆ మధ్య అర్జున్ రెడ్డి విడుదలైనప్పుడు ఈ విషయాన్ని చాలా మంది విట్‌నెస్ చేశారు.




