- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor promoting Devara movie, looking to make a mark in south film industry
Janhvi Kapoor: దేవర విషయంలో నో కాంప్రమైజ్.. సౌత్‌ను షేక్ చేస్తానంటున్న జాన్వీ..
లేనిదాని కోసం ఆరాటపడేకంటే ఉన్నదాంతో సర్దుకుపోవడమే బెటర్ అంటున్నారు జాన్వీ కపూర్. కెరీర్ మొదటి నుంచి ఇదే అలవాటు చేసుకున్నారు ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. బాలీవుడ్ కంటే సౌత్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జాన్వీ.. తాజాగా మరో అడుగు ముందుకేసారు. దేవరపై ఛాన్స్ దొరికిన ప్రతీసారి ప్రేమ చూపిస్తున్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా.. జాన్వీ కపూర్ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు.
Updated on: Jul 16, 2024 | 11:24 AM

లేనిదాని కోసం ఆరాటపడేకంటే ఉన్నదాంతో సర్దుకుపోవడమే బెటర్ అంటున్నారు జాన్వీ కపూర్. కెరీర్ మొదటి నుంచి ఇదే అలవాటు చేసుకున్నారు ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. బాలీవుడ్ కంటే సౌత్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జాన్వీ.. తాజాగా మరో అడుగు ముందుకేసారు. దేవరపై ఛాన్స్ దొరికిన ప్రతీసారి ప్రేమ చూపిస్తున్నారు.

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా.. జాన్వీ కపూర్ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత దారుణంగా ఉన్న సమయంలో.. జాన్వీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇదే ఈమెకు వరంగా మారుతుంది. ఆల్రెడీ దేవరలో జూనియర్ ఎన్టీఆర్‌తో జోడీ కడుతున్న ఈమెకు.. తాజాగా రామ్ చరణ్‌తోనూ నటించే అవకాశం వచ్చింది.

బుచ్చిబాబు సినిమాలో జాన్వీ పేరు కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. జాన్వీ జర్నీ ఇక్కడితో అయితే ఆగదు.. దేవర, RC16 విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి ఆఫర్స్ రావడం ఖాయం. అలాగే సూర్యతోనూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ ప్లాన్ చేస్తున్న కర్ణలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ హ్యాండిచ్చినా.. సౌత్ మాత్రం జాన్వీని ఆదుకుంటుంది.

తనకు కష్టకాలంలో అవకాశాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్న సౌత్ ఇండస్ట్రీపై ప్రేమ చూపిస్తున్నారు జాన్వీ. తను నటిస్తున్న సినిమాలను ప్రతీచోట ప్రమోట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే #Thangam అనే పేరును బాగా ప్రమోట్ చేస్తున్నారు. దేవర సినిమాలో తన కారెక్టర్ పేరు ఇది. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జాన్వీ.

జాన్వీ కపూర్ అంటేనే గ్లామర్ క్వీన్ ఇమేజ్ సొంతం. కానీ దేవరలో మాత్రం పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇది ఈమె కెరీర్‌కు కీలకమైన సినిమా. ఎందుకంటే మొదటి సినిమా హిట్ అయిందంటే.. ఆఫర్స్ వద్దన్నా వచ్చేస్తుంటాయి. అందుకే దేవరపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు జాన్వీ. ఆ తర్వాత చరణ్, సూర్య ఎలాగూ ఉన్నారు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు.




