AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: 1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’.. భాజా భజంత్రీలతో సంబరాలు చేసుకున్న ప్రభాస్ అభిమానులు.. వీడియో

అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో కల్కి సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే కల్కి సినిమా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గానూ కల్కి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి

Kalki 2898 AD: 1000 కోట్ల క్లబ్‌లో  'కల్కి'.. భాజా భజంత్రీలతో సంబరాలు చేసుకున్న ప్రభాస్ అభిమానులు.. వీడియో
Prabhas Kalki 2898 Ad Movie
Basha Shek
|

Updated on: Jul 16, 2024 | 10:33 AM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో కల్కి సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే కల్కి సినిమా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గానూ కల్కి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ప్రస్తుతం బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రభాస్ సినిమా దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. ఎక్కడ చూసినా కల్కి థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. దీంతో చిత్ర బృందం ఫుల్‌ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కల్కి మూవీ సక్సెస్‌ వేడుకను చిత్రబృంద సభ్యులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ భాజా భజంత్రీలతో ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కల్కి సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

వైజయంతీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమాను నిర్మించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. దీనిపై నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వనీదత్ కూడా క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!