Hardik Pandya: హార్దిక్ భార్య సంచలన నిర్ణయం.. కుమారుడితో భారత్ వదిలి వెళ్లిపోయిన నటాషా.. వీడియో వైరల్

హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు షికార్లు సమయంలో నటాసా స్టాంకోవిచ్ తన లగేజ్‌బ్యాగ్ ను సర్దుకుని కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది. బుధవారం (జులై 17) తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

Hardik Pandya: హార్దిక్ భార్య సంచలన నిర్ణయం.. కుమారుడితో భారత్ వదిలి వెళ్లిపోయిన నటాషా.. వీడియో వైరల్
Hardik Pandya Family
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2024 | 10:10 AM

హార్దిక్‌ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వదిలి వెళ్లిపోయిందని సమచారం. హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు షికార్లు సమయంలో నటాసా స్టాంకోవిచ్ తన లగేజ్‌బ్యాగ్ ను సర్దుకుని కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది. బుధవారం (జులై 17) తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. నటాసా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మొదటి ఫొటోలో.. నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న తన సూట్‌కేస్‌ను చూపింది. ‘ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది’ అంటూ పలు ఎమోజీలను షేర్ చేసిందామె. కన్నీళ్లతో ఉన్న ఎమోజీతో పాటు విమానం, ఇల్లు, లవ్‌ సింబల్‌ను ఆమె షేర్‌ చేసింది. మరో ఫోటోలో, ఆమె తన పెంపుడు కుక్క ఫొటోస్ ను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013 బాలీవుడ్‌ సినిమా సత్యాగ్రహంతో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 8 తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజ్ తోనే పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. 2020లో అతనితో కలిసి పెళ్లిపీటలెక్కింది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నటాషా తన ఫ్యామిలీకే ప్రాధాన్యమిచ్చింది.

ముంబై ఎయిర్ పోర్టులో కుమారు అగస్త్య తో నటాషా స్టాంకో విక్.. వీడియో

అయితే గత కొంత కాలంగా హార్దిక్‌ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే గత కొంత కాలంగా హార్దిక్ ఒంటరిగానే ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి కూడా సింగిల్ గానే హాజరయ్యాడు. ఇలాంటి సమయంలో బుధవారం తెల్లవారుజామున భారత్‌ వదిలి తన కుమారుడితో సహా నటాషా వెళ్లిపోయింది. వీరిద్దరూ సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది.

సొంతూరిలో హార్దిక్ పాండ్యా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!