- Telugu News Photo Gallery Cricket photos Sunrisers Hyderabad Might Retain These 4 Players Ahead Of IPL 2025 Mega Auction
SRH: ఈ 5గురి ప్లేయర్లకు కావ్య మారన్ పింక్ స్లిప్.. మెగా వేలంలో వారిపైనే గురి.. ఎవరంటే.?
ఒకవేళ ఈ ప్రతిపాదన కన్ఫర్మ్ అయితే.. ఫ్రాంచైజీలు అన్నీ కూడా మరో ఐదు సీజన్లకు సరిపడా బలమైన జట్లను రూపొందించాల్సిన పని పడుతుంది. అలాగే రిటైన్ చేసుకునే లిస్టులో కూడా పలు కీలక మార్పులు చేసుకోవాల్సి వస్తుంది.
Updated on: Jul 17, 2024 | 6:56 PM

ఐపీఎల్ 2025కి రంగం సిద్దం చేస్తోంది బీసీసీఐ. ఈ సీజన్‌కు ముందుగా మెగా వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీల రిటైన్ లిస్టులో బోర్డు మరికొద్ది రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించింది. అయితే ఐపీఎల్ 2022 మెగా వేలం మాదిరిగానే 3 + 1(RTM)కే బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ ఈ ప్రతిపాదన కన్ఫర్మ్ అయితే.. ఫ్రాంచైజీలు అన్నీ కూడా మరో ఐదు సీజన్లకు సరిపడా బలమైన జట్లను రూపొందించాల్సిన పని పడుతుంది. అలాగే రిటైన్ చేసుకునే లిస్టులో కూడా పలు కీలక మార్పులు చేసుకోవాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులో రిటైన్ చేసుకునే లిస్టును ఇప్పటికే సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు షాబాజ్ అహ్మద్‌లను రిటైన్ చేసుకుంటుందట.

ఇక రైట్ టూ మ్యాచ్ కార్డు కింద హైదరాబాదీ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డిని తీసుకోనుందట సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇదే జరిగితే దాదాపు ఆ ఫ్రాంచైజీ స్టార్ ప్లేయర్స్ అందరూ మెగా వేలంలోకి రానున్నారు.

ఇక్కడ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ దిగులుపడాల్సిన పన్లేదు. ప్యాట్ కమిన్స్, క్లాసన్, మార్క్‌రమ్, ఫిలిప్స్, జాన్సన్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, హసరంగా, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లను మళ్లీ వేలంలో తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

అటు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాళ్లు మెగా వేలంలో వస్తారని రూమర్స్ వినిపించడంతో.. కావ్య మారన్ వారిపై ఎక్కువ డబ్బులు వెచ్చించేందుకు సిద్దంగా ఉందని టాక్.





























