Varalaxmi Sarathkumar: ‘నా భార్య కోసం నేనే పేరును మార్చుకుంటున్నా’.. వరలక్ష్మిపై ప్రేమను కురిపించిన భర్త.. వీడియో

థాయ్ లాండ్ వేదికగా జులై 3న వరలక్ష్మి, నికోలాయ్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సీఎం స్టాలిన్ తో సహా దక్షిణాది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు

Varalaxmi Sarathkumar: 'నా భార్య కోసం నేనే పేరును మార్చుకుంటున్నా'.. వరలక్ష్మిపై ప్రేమను కురిపించిన భర్త.. వీడియో
Varalaxmi Sarathkumar
Follow us
Basha Shek

|

Updated on: Jul 18, 2024 | 12:21 PM

టాలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ముంబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, గ్యాలరీ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్ దేవ్‌తో కలిసి ఏడుడుగులు నడిచింది. థాయ్ లాండ్ వేదికగా జులై 3న వరలక్ష్మి, నికోలాయ్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సీఎం స్టాలిన్ తో సహా దక్షిణాది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే హనీమూన్ కు చెక్కేశారీ న్యూ కపుల్. ఇటీవలే మళ్లీ ఇండియా వచ్చారు. తాజాగా ఈ కొత్త జంట ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తమ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వరలక్ష్మి, నికోలాయ్ సచ్ దేవ్. ముఖ్యంగా వరలక్ష్మిపై ప్రేమను కురిపించాడు భర్త. ‘ మా పెళ్లి తర్వాత వరలక్ష్మీ తన పేరును మార్చుకోవాలని అనుకుంది. శరత్ కుమార్ పేరుని అలానే ఉంచి నా పేరును యాడ్ చేయాలని అనుకుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ సచ్ దేవ్‌గా మార్చుకుందాం అనుకుంది. కానీ నేను వద్దన్నాను. దీనికి బదులు ఆమె పేరుని నేనే తీసుకుంటాను. ఇక నుంచి నా పేరును ‘నికోలాయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ సచ్ దేవ్‘గా మార్చకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు నికోలాయ్.

‘నా భార్య పేరును నాలో కలుపుకోవడం వల్ల శరత్ కుమార్, వరలక్ష్మీ నుంచి వచ్చే వారసత్వం జీవితాంతం కొనసాగుతుంది. ఇకపై కూడా నా భార్య నిమాలు కొనసాగిస్తుందని, మీ అందరూ తనపై ప్రేమ కురిపిస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ. వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు. సినిమాలే ఫస్ట్ లవ్. ఆ తర్వాతే నేను అంటూ’ వరుపై ప్రేమను కురిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరలక్ష్మి పేరును తనలో చేర్చుకున్న నికోలాయ్ పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే…ఈ ఏడాది హనుమాన్, శబరి మూవీలతో అలరించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రస్తుతం కన్నడ చిత్రం మాక్స్ లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే తమిళంలో ధనుష్ సినిమా రాయన్ లోనూ కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

వరలక్ష్మి దంపతుల ప్రెస్ మీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.