- Telugu News Photo Gallery Cinema photos Actress Taapsee Pannu Haseen Dilruba sequel will be release in Netflex OTT flatform on August 09 Telugu Heroines Photos
Haseen Dilruba: ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఓ మోడ్రన్ అమ్మాయి..
ఓటీటీల హవా పెరగటంతో క్రియేటివ్ కంటెంట్‌కు కావాల్సినంత స్పేస్ దొరుకుతోంది. కమర్షియల్ లెక్కలు... ఇమేజ్ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టి కథల్లో క్యారెక్టరైజేషన్స్‌లో ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. స్టీరియోటైప్ కంటెంట్‌కు గుడ్‌బై చెప్పేసి... బోల్డ్ అండ్ ఇంటస్ట్రింగ్ లైన్స్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. అంతేకాదు సూపర్ హిట్ అయిన కథలను క్యారెక్టర్లను కంటిన్యూ చేస్తున్నారు.
Updated on: Jul 18, 2024 | 12:03 PM

ఓటీటీల హవా పెరగటంతో క్రియేటివ్ కంటెంట్‌కు కావాల్సినంత స్పేస్ దొరుకుతోంది. కమర్షియల్ లెక్కలు... ఇమేజ్ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టి కథల్లో క్యారెక్టరైజేషన్స్‌లో ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

స్టీరియోటైప్ కంటెంట్‌కు గుడ్‌బై చెప్పేసి... బోల్డ్ అండ్ ఇంటస్ట్రింగ్ లైన్స్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. అంతేకాదు సూపర్ హిట్ అయిన కథలను క్యారెక్టర్లను కంటిన్యూ చేస్తున్నారు.

తాప్సీ లీడ్ రోల్‌లో తెరకెక్కిన డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ హసీన్ దిల్రుబా. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఓ మోడ్రన్ అమ్మాయి... అనుకోకుండా మరో వ్యక్తికి దగ్గరవ్వడం.. తరువాత తప్పు తెలుసుకొని భర్త ప్రేమకోసం తాపత్రేయ పడటం అనే కాన్సెప్ట్‌ను కాస్త బోల్డ్‌గానే చెప్పారు మేకర్స్.

సౌత్‌లో కమర్షియల్ హీరోయిన్ రోల్స్ మాత్రమే చేసిన తాప్సీ. బాలీవుడ్ వెళ్లాక రూటు మార్చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నటిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే యాక్టింగ్ స్కోప్‌కు ఉన్న గ్లామరస్ రోల్ కావటంతో హసీన్ దిల్రుబా సినిమాకు వెంటనే ఓకే చెప్పేశారు.

తొలి భాగం సూపర్ హిట్ కావటంతో ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా సినిమాను ఎనౌన్స్ చేశారు. మరో కొత్త నగరంలో విధ్వంసం సృష్టించడానికి నా అందమైన హృదయం సిద్దమవుతుంది అంటూ ఇంట్రస్టింగ్‌గా సీక్వెల్‌ను స్టార్ట్ చేశారు.

అయితే తొలి భాగం ఓటీటీలో రిలీజ్ అయినా... సీక్వెల్‌ను థియేట్రికల్ రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేసింది చిత్రయూనిట్. తాజాగా థియేట్రికల్ ప్లాన్‌ను పక్కన పెట్టేసింది ఈ మూవీ టీమ్. తొలి భాగం లాగే సీక్వెల్‌ను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించింది.

ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ ఆగస్టు 9న ఆడియన్స్ ముందుకు రానుంది. కొద్ది రోజులుగా బిగ్ స్క్రీన్ మీద మెప్పించలేకపోతున్న తాప్సీ, ఈ సినిమాతో ఓటీటీలో అయినా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు.




