- Telugu News Photo Gallery Cinema photos Heroine Samantha ruth prabhu joined in new movie shooting on July 2024 , details here Telugu Actress Photos
Samantha Ruth Prabhu: చాల రోజుల తరువాత గుడ్‌న్యూస్ చెప్పిన సమంత.!
జీవితంలో గత మూడేళ్లు ఇంకోలా ఉంటే బావుండేదని ఇంతకు ముందు ఫ్రెండ్‌తో డిస్కస్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా ఆలోచనా తీరు అలా లేదు. జీవితం మన నుంచి ఏం డిమాండ్ చేస్తే దాన్ని మనం చేసి తీరాలి. పరిస్థితుల నుంచి బయటపడ్డ ప్రతిసారీ గెలిచినట్టే అని అంటున్నారు సమంత రూత్ ప్రభు. నిప్పుల మీద నడక అంత ఈజీ కాదంటున్నారు సామ్. ఇప్పుడు మరింత స్ట్రాంగ్‌గా ఉన్నానని చెబుతున్నారు.
Updated on: Jul 18, 2024 | 12:44 PM

కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న సమంత, చాలా రోజుల తరువాత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. త్వరలో సిటాడెట్: హనీ బనీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో కెరీర్ గురించి మాట్లాడారు.

నిప్పుల మీద నడక అంత ఈజీ కాదంటున్నారు సామ్. ఇప్పుడు మరింత స్ట్రాంగ్‌గా ఉన్నానని చెబుతున్నారు. త్వరలోనే నయా మూవీ సెట్స్ లో జాయిన్ అవుతానంటూ గుడ్‌న్యూస్ చెప్పేశారు.

మయోసైటిస్‌తో ఇబ్బందిపడ్డ సమంత గత కొన్నేళ్లుగా కెమెరాకు దూరంగా ఉంటున్నారు. వచ్చే నెల నుంచి తన పూర్వ వైభవాన్ని ఆస్వాదించడానికి రెడీ అవుతున్నానని ప్రకటించారు. కొత్త సినిమా కోసం తాను దాదాపు ఆరు రంగాల్లో శిక్షణ తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

మార్షల్ ఆర్ట్స్, ఆర్చెరీ, కత్తి సాము, గుర్రపు స్వారీ, బాలేతో పాటు ఇంకా పలు విషయాల మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలిపారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రకటించారు సామ్.

గత మూడేళ్లను తన జీవితంలో ఊహించలేదని చెప్పుకొచ్చారు ఈ బ్యూటీ. ఆధ్యాత్మిక చింతన తనలో పరిపక్వతను పెంచిందని అన్నారు. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ మూస ధోరణికి చెక్ పెట్టాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

ఇవాళ్టి ఇండస్ట్రీలో చాలా మంది మహిళలు క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారని చెప్పారు. తాను కూడా క్వాంటిటీని పట్టించుకోవడం లేదని, స్టీరియో టైప్‌ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నానని అన్నారు.

సామ్ చేతిలో ప్రస్తుతం మా ఇంటిబంగారం, సిటాడెల్ ఉన్నాయి. సిటాడెల్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. యాక్షన్ ప్రధానంగా సాగే మా ఇంటి బంగారం చిత్రాన్ని సమంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తెరకెక్కించనుంది.




