Bharateeyudu: భారతీయుడు 3లో ఏముంది.? శంకర్ ఎలా ప్లాన్ చేసారు.?

ఆరేళ్ళ కింద మొదలైంది.. ఐదేళ్లుగా సెట్స్‌పైనే ఉంది.. రెండేళ్లు ఆగిపోయింది.. ఏడాదిన్నర కింద హడావిడిగా తిరిగి మొదలైంది.. మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని ఇప్పుడు థియేటర్స్‌లోకి వచ్చేసింది ఇండియన్ 2. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు మధ్య విడులై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడిన విషయం తెలిసిందే. మరి ఇండియన్‌ 3 సంగతి ఏంటి.? మేకర్స్ ఏమి ప్లాన్ చేసారు.? ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. 

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Jul 18, 2024 | 8:51 AM

భారతీయుడు సినిమా విడుదలై మార్నింగ్‌ షో పడకముందు నుంచే ఓవర్సీస్‌ నుంచి వచ్చిన రివ్యూలు మిశ్రమంగానే వినిపించాయి. పెట్టిన ఖర్చు స్క్రీన్‌ మీద బలంగా కనిపించిందన్నవారు, కథ విషయంలో ఎగ్జయిట్‌ అయి మాట్లాడలేదు. ఎమోషన్స్ పరంగానూ మెచ్చుకోలు ఎక్కడా వినిపించలేదు.

1 / 5
కల్కి తర్వాత కమల్‌ కెరీర్‌లో విడుదలైన మూవీ కాబట్టి, పర్ఫెక్ట్ గా టార్గెట్‌ చేస్తే, ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ నెంబర్‌ బాక్సాఫీస్‌ దగ్గర కనిపిస్తుందని ట్రేడ్‌ వర్గాల్లోనూ ఆశలు కనిపించాయి. అయితే కథ బలంగా లేకపోవడంతో ఆ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది. 

2 / 5
 ఇండియన్ 2 మాత్రమే కాదు.. దీనికి పార్ట్ 3 కూడా ఉందని ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. విడుదలకు ముందు కమల్ హాసన్ అయితే ఓ అడుగు ముందుకేసి భారతీయుడు 3 కోసమే తాను 2 చేసానంటూ హైప్ పెంచేసారు. కానీ ఇండియన్ 2 సినిమా మేకర్స్ కి నిరాశ మిగిల్చింది.

3 / 5
ఇండియన్ 3 షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైంది. గేమ్ ఛేంజర్ విడుదలైన తర్వాత.. మిగిలిన పార్ట్ కూడా ఫినిష్ చేసి వీలైనంత త్వరగా పార్ట్ 3 విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు శంకర్. దానిపై ఆసక్తి పెరగాలంటే అందులో ఏముంటుందో ఆడియన్స్‌కు చిన్న టీజర్ అయినా ఇవ్వాలిగా.. అందుకే అదే పనిలో ఉన్నారు శంకర్ అండ్ టీం. త్వరలోనే టీజర్ రానుంది.

4 / 5
 వీరశేఖరన్‌ సేనాపతి కథను ఇండియన్‌3లో చూపిస్తానని అన్నారు శంకర్‌. ఈ సినిమా 2025లో స్క్రీన్‌ మీదకు రావడం పక్కా. సేనాపతి తల్లిదండ్రుల కథగా ఈ సినిమా తెరకెక్కుతుందనే మాట వైరల్‌ అవుతోంది. తొలి స్వాతంత్ర పోరాట సమరంలో పాల్గొన్న వ్యక్తిగా వీరశేఖరన్‌ సేనాపతిని ప్రొజెక్ట్ చేస్తారు శంకర్‌. ఈ సినిమా కూడా కాస్ట్యూమ్‌ డ్రామానే.

5 / 5
Follow us