- Telugu News Photo Gallery Cinema photos Legendary directors who have completely lost track and are looking for their best comeback
Directors: ట్రాక్ తప్పిన స్టార్ దర్శకులు.. బెస్ట్ కమ్ బ్యాక్ ఇవ్వనున్నారా.?
ఎలా ఉండేవాళ్లు ఎలా అయిపోయార్రా.. ఇప్పుడు కొందరు దర్శకులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒకప్పుడు వాళ్ల నుంచి సినిమాలు వస్తున్నాయంటే హిట్ అనే మాట తప్ప మరో మాటే వినిపించేది కాదు. కానీ ఈ మధ్య వాళ్లు పూర్తిగా ట్రాక్ తప్పారు. మరి అసలు సిసలైన కమ్ బ్యాక్ కోసం చూస్తున్న ఆ లెజెండరీ దర్శకులెవరో తెలుసా..?
Updated on: Jul 18, 2024 | 8:26 AM

ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకులకు కూడా అప్పుడప్పుడూ కష్టాలు వస్తుంటాయి. తాజాగా శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్ లాంటి లెజెండరీ దర్శకులకు ఇదే జరుగుతుంది. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఈ దర్శకులు.. ఇప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు.

రాజమౌళి కంటే ముందే ఇండియన్ సినిమాకు విజువల్ వండర్స్ ఇచ్చిన దర్శకుడు శంకర్. అలాంటి డైరెక్టర్ నుంచి వచ్చిన భారతీయుడు 2కు పూర్తిగా నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఒక భాగంలో ముగించాల్సిన సినిమాను.. బలవంతంగా మూడో భాగానికి లాగి.. ల్యాగ్ చేసారంటూ శంకర్‌పై విమర్శలొస్తున్నాయి.

వీటికి గేమ్ ఛేంజర్‌తో సమాధానం చెప్పాలని చూస్తున్నారు ఈ దర్శకుడు.శంకర్ కెరీర్ ఇప్పుడు గేమ్‌ఛేంజర్‌పైనే ఆధారపడి ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది. ఇందులో రెండోసారి రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా కనిపించనున్నారు.

మరోవైపు మురుగదాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పట్లో సెన్సేషనల్ సినిమాలు చేసిన మురుగదాస్.. కొన్నేళ్లుగా ట్రాక్ తప్పారు. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఓ సినిమా.. హిందీలో సల్మాన్ ఖాన్‌తో సికిందర్ సినిమాలు చేస్తున్నారు. వీటిపైనే ఈ దర్శకుడి కెరీర్ ఆధారపడి ఉంది.

గౌతమ్ మీనన్ సైతం సరైన కమ్‌బ్యాక్ కోసం చూస్తున్నారు. కొన్నేళ్లుగా ఈయన నుంచి వచ్చిన సినిమాలు కనీసం వచ్చినట్లు కూడా గుర్తించట్లేదు ఆడియన్స్. ప్రస్తుతం మమ్ముట్టి, సమంత జంటగా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారు గౌతమ్. మరి ఈ ముగ్గురు లెజెండరీ దర్శకులు తమ రేంజ్ కమ్ బ్యాక్ ఎప్పుడిస్తారో చూడాలిక.




