- Telugu News Photo Gallery Cinema photos Vijay Thalapathy Meets Actress Rambha Family In Canada, Photos Goes Viral
Vijay Thalapathy: విజయ్ దళపతి ఎత్తుకున్న ఈ చిన్నోడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొడుకు.. ఎవరంటే..
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ లైఫ్ టైమ్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. లియో తర్వాత విజయ్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Updated on: Jul 17, 2024 | 9:52 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ లైఫ్ టైమ్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. లియో తర్వాత విజయ్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్ ప్రముఖ హీరోయిన్ రంభ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబంతో కలిసి విజయ్ కాసేపు సరాదాగా గడిపారు.

ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు హీరోయిన్ రంభ. చాలా కాలం తర్వాత నాకు ఇష్టమైన హీరోను కలిశానంటూ పోస్ట్ చేసింది రంభ. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన రంభ.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది.

హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తుంది.





























