- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes jr ntr and ram charan following prabhas strategy in movie promotions
Tollywood News: ప్రభాస్ దారిలో టాలీవుడ్ హీరోలు.. ఫార్ములా వర్కవుట్ అయ్యేనా
కల్కి సినిమా హిట్ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఆడియన్స్‌కు చాలా కంప్లయింట్స్ ఉన్నాయి. ఏదో మొక్కుబడిగా ఏర్పాటు చేసిన ఒకటి రెండు ఈవెంట్స్ తప్ప ఈ సినిమా కోసం డార్లింగ్ అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేయలేదు. ఇప్పుడు మిగతా టాలీవుడ్ హీరోలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.ప్రభాస్ పెద్దగా బయటకు రాకపోయినా కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Ravi Kiran
Updated on: Jul 17, 2024 | 11:00 PM

సాహోరే బాహుబలి అంటూ ఇప్పటికీ హిందీ మార్కెట్‌లో నెంబర్ వన్ కలెక్షన్లున్న సినిమాగా బాహుబలి2నే గౌరవిస్తున్నారు. ఆ నెక్స్ట్ ప్లేస్ నాదేనండీ అంటూ సైలెంట్‌గా కేజీయఫ్2తో ఖర్చీఫ్ వేసేశారు ప్రశాంత్ నీల్.

ప్రభాస్ పెద్దగా బయటకు రాకపోయినా కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ అన్నిసార్లు ఇలాగే అవుతుందన్న గ్యారెంటీ లేదు. సినిమా సక్సెస్ విషయంలో ప్రమోషన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ముఖ్యంగా స్టార్స్... ఆడియన్స్ ముందుకు వస్తేనే సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుంది. ఈ విషయాన్ని అందరు హీరోలు లైట్ తీసుకుంటున్నారు.

దేవర సినిమా రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఆల్రెడీ టీజర్‌తో పాటు ఓ సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. కానీ ఆ బజ్‌ను కంటిన్యూ చేయటంలో మాత్రం మేకర్స్ వెనకబడ్డారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి తారక్ సైడ్ నుంచి ఒక్క అప్‌డేట్ కూడా లేదు. దీంతో కనీసం ఒక్క ప్రెస్‌మీట్‌లో అయినా ఎన్టీఆర్ కనిపిస్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్.

రామ్ చరణ్ పరిస్థితైతే మరింత విచిత్రంగా ఉంది. చరణ్ నెక్ట్స్ మూవీ ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుందన్న విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు. దీంతో షూటింగ్స్, పర్సనల్ ట్రిప్స్ తప్ప మీడియాతో, ఫ్యాన్స్‌తో టచ్‌లోకి రావడమే మానేశారు చరణ్. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వస్తే తప్ప చరణ్ ఆడియన్స్‌తో టచ్‌లోకి వచ్చే పరిస్థితి లేదు.

ప్రభాస్ విషయంలో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా కల్కి సక్సెస్ అయ్యింది. కానీ అందరు హీరోలకు అలా వర్క్ అవుట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే ఎన్టీఆర్, చరణ్ కాస్త ఆడియన్స్‌తో టచ్‌లో ఉంటే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.





























