Kim Kardashian: ఇలాంటి దరిద్రపు ఫోటోషూట్స్ చేస్తే.. ఊరుకుంటారా.! గూబ గుయ్యమనిపించారు గా..!

Kim Kardashian: ఇలాంటి దరిద్రపు ఫోటోషూట్స్ చేస్తే.. ఊరుకుంటారా.! గూబ గుయ్యమనిపించారు గా..!

Anil kumar poka

|

Updated on: Jul 18, 2024 | 12:53 PM

అంబానీ ఇంట పెళ్ళికి దేశవిదేశాలనుంచి అతిధులు వచ్చారు. ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రెటీల నుంచి హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ పెళ్ళివేడుకకు హాజరయ్యారు. అలాగే అమెరికన్ పాప్ సింగర్స్ కూడా హాజరయ్యారు. అదేవిధంగా అమెరికన్ నటి కిమ్ కర్దాషియాన్ కూడా ఈవేడుక కోసం ఇండియాకు వచ్చింది. తాజాగా ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కిమ్ కర్దాషియాన్..

అంబానీ ఇంట పెళ్ళికి దేశవిదేశాలనుంచి అతిధులు వచ్చారు. ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రెటీల నుంచి హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ పెళ్ళివేడుకకు హాజరయ్యారు. అలాగే అమెరికన్ పాప్ సింగర్స్ కూడా హాజరయ్యారు. అదేవిధంగా అమెరికన్ నటి కిమ్ కర్దాషియాన్ కూడా ఈవేడుక కోసం ఇండియాకు వచ్చింది. తాజాగా ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కిమ్ కర్దాషియాన్.. తన ఫొటోలు, వీడియోలను తెగ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు పెద్ద దుమారాన్నే రేపాయి.

రీసెంట్ గా వినాయకుడి విగ్రహంపై చేయి వేసి ఫోటోషూట్ చేసింది కిమ్ కర్దాషియాన్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందువుల మనోభావాలను కిమ్ కర్దాషియాన్ దెబ్బతీశారని ఆరోపించారు. తర్వాత ఆ ఫోటోను ఆమె డిలీట్ చేసింది.

ఇక ఇంతకు ముందు కూడా చాలా మంది విదేశీ సెలబ్రిటీలు ఇలాంటి తప్పు చేశారు. హిందువులు పూజించే దేవుళ్ల ఫోటోలు, విగ్రహాలు కొంతమంది బయటి వ్యక్తులకు కేవలం అలంకార వస్తువులుగా కనిపిస్తాయి. దాంతో వాటితో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు కిమ్ కర్దాషియాన్ కూడా అదే తప్పు చేసింది. దీంతో తీవ్ర విమర్శల పాలైంది. నెటిజెన్స్‌ నుంచి దారుణ కామెంట్స్ ఇప్పటికీ ..తన చర్చ కారణంగా ఎదుర్కొంటూనే ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.