Katrina Kaif: తల్లి కాబోతున్న మల్లీశ్వరి.. అందుకే అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అలా చేసిందా? వీడియో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అదేనండి మన మల్లీశ్వరి త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుందా? ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందా? అంటే అవునంటున్నారు బాలీవుడ్ మీడియా జనాలు. విక్కీ కౌశల్- కత్రినాల ఇంటికి త్వరలోనే మరొకరు రానున్నారంటూ అభిమానులు, నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. వీరిలా అభిప్రాయపడడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

Katrina Kaif: తల్లి కాబోతున్న మల్లీశ్వరి.. అందుకే అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అలా చేసిందా? వీడియో
Katrina Kaif
Follow us
Basha Shek

|

Updated on: Mar 05, 2024 | 11:25 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అదేనండి మన మల్లీశ్వరి త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుందా? ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందా? అంటే అవునంటున్నారు బాలీవుడ్ మీడియా జనాలు. విక్కీ కౌశల్- కత్రినాల ఇంటికి త్వరలోనే మరొకరు రానున్నారంటూ అభిమానులు, నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. వీరిలా అభిప్రాయపడడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అదేంటంటే.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అట్టహాసంగా జరిగింది. అక్కడకు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ కూడా జంటగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో ఆమె ప్రతిసారి తన ఉదరాన్ని దుపట్టాతో పదే పదే దాచుకుంటూ కనిపించింది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కత్రినా గర్భంతో ఉందని, తన బేబీ బంప్ ను కనిపించకుండా ఉండేందుకే ఇలా చేసిందంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అనుష్కా శర్మ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తాను తల్లికానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కత్రినా కూడా శుభవార్త చెప్పొచ్చని బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. కత్రినా, విక్కీ కౌశల్ లది ప్రేమ వివాహం. వీరికి 2021 డిసెంబర్‌ నెలలో వివాహమైంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు బాలీవుడ్ సెలబ్రిటీలందరూ తరలి వచ్చారు. అంటే కత్రినా, విక్కీల పెళ్లి జరిగి సుమారు రెండున్నరేళ్లు కావస్తోంది. త్వరోలనే ఈ దంపతులిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వీటితో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే కత్రినా, విక్కీల్లో ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వక తప్పదు.

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కత్రినా, విక్కీ కౌశల్..

ట్రెడిషినల్ దుస్తుల్లో తళుక్కుమన్న క్యూట్ కపుల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు...
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!