Fighter OTT: ముందుగానే ఓటీటీలోకి ‘ఫైటర్‌’.. హృతిక్, దీపికల యాక్షన్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న థియేటర్లలోకి విడుదలైన ఈ దేశ భక్తి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా ఫైటర్ రూ. 350 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఫైటర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం..

Fighter OTT: ముందుగానే ఓటీటీలోకి 'ఫైటర్‌'.. హృతిక్, దీపికల యాక్షన్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Fighter Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 04, 2024 | 12:52 PM

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన చిత్రం ‘ఫైటర్’. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ ఎయిర్ ఫోర్స్ బేస్ట్ యాక్షన్ డ్రామాలో అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అనిల్ కపూర్, అలాగే బిపాసా భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న థియేటర్లలోకి విడుదలైన ఈ దేశ భక్తి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా ఫైటర్ రూ. 350 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఫైటర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ఏకంగా రూ. 180 కోట్ల రేటుకు దక్కించుకుందట. ముందస్తు ఒప్పందం ప్రకారం మార్చి 4వ వారంలో హృతిక్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురావాలనుకున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మార్చి 2వ వాంలోనే ఫైటర్ ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ వినిపిస్తోంది.

పైటర్ సినిమాను వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు భారీ బడ్జెట్ తో అత్యత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇందులో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజిదా షేక్‌, అశుతోష్ రాణా, రిషబ్‌, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ సంగీతం అందించారు. కాగా హృతిక్‌ ఫైటర్ సినిమాను వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఎయిర్‌ ఫోర్స్‌ యూనిఫాంలో హృతిక్ రోషన్, దీపికా పదుకోణెల మధ్య లిప్ లాక్ సీన్స్‌, రొమాంటిక్‌ సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన అధికారి ఒకరు ఫైటర్ సినిమాకు లీగల్ నోటీసులు కూడా పంపారు.

ఇవి కూడా చదవండి

ఐఏఎఫ్ లీగల్ నోటీసులు

హృతిక్ రోషన్ ట్విటర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే