Balagam: బలగం రిలీజై ఏడాది.. డైరెక్టర్ వేణు ఎమోషనల్.. ఇప్పుడీ సూపర్ హిట్ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

గ‌త ఏడాది చిన్న‌సినిమాగా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన చిత్రం బలగం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కళ్లకు కట్టినట్లు చూపించారీ సినిమాలో. జబర్దస్త్ కమెడియన్ వేణు మొదటి సారిగా మెగా ఫోన్ పట్టి ఈ బలగం సినిమాను తెరకెక్కించారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు.

Balagam: బలగం రిలీజై ఏడాది.. డైరెక్టర్ వేణు ఎమోషనల్.. ఇప్పుడీ సూపర్ హిట్ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Balagam Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 03, 2024 | 8:18 PM

గ‌త ఏడాది చిన్న‌సినిమాగా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన చిత్రం బలగం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కళ్లకు కట్టినట్లు చూపించారీ సినిమాలో. జబర్దస్త్ కమెడియన్ వేణు మొదటి సారిగా మెగా ఫోన్ పట్టి ఈ బలగం సినిమాను తెరకెక్కించారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.27 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు కాసుల పంట పండించింది. అన్నిటికీ మించి అంతర్జాతీయంగా అవార్డులు, విమర్శకుల ప్రశంసలు పొందింది. తెలుగు సినిమాల్లో తనకంటూ ట్రెండ్ సృష్టించుకున్న బలగం సినిమా విడుదలై ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు యెల్దండి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘ నా బలగం ను ఇంత ఆదరించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ మరోసార నా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు.

హర్షిత రెడ్డి, హన్షితా రెడ్డి బలగం సినిమాను నిర్మించగా.. దిల్‍రాజు సమర్పించారు. ఈ ఎమోషనల్ సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. అలాగే కుటుంబ పెద్ద గాజుల కొమరయ్యగా నటించిన సుధాకర్ రెడ్డి కూడా తన నటనతో కకన్నీళ్లు పెట్టించారు. అలాగే కోట జయరాం, కొమ్ము సుజాత, మురళీధర్ గౌడ్, రూపలక్ష్మి, మైమ్ మధు, వేణు తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికీ అందుబాటులో ఉంది. మరోసారి చూడాలనుకునేవారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ వేణు ఎమోషనల్ పోస్ట్..

తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్..

మెగాస్టార్ చిరంజీవితో బలగం వేణు..

బలగం సింగర్ దాసరి కొండప్పకు పద్మశ్రీ.. వేణు అభినందనలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..