- Telugu News Photo Gallery Cricket photos Star Cricketers With Family Arrive At Jamnagar To Attend Anant Ambani Pre Wedding Festivities, See Photos
Anant Ambani: అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుక .. కుటుంబ సభ్యులతో తరలివచ్చిన క్రికెటర్లు.. ఫొటోస్ చూశారా?
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శుక్రవారం (మార్చి01) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ తారలు, క్రికెటర్లు ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగం కానున్నారు.
Updated on: Mar 01, 2024 | 9:56 PM

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శుక్రవారం (మార్చి01) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ తారలు, క్రికెటర్లు ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగం కానున్నారు.

స్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి కూడా అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కోసం జామ్‌నగర్ చేరుకున్నారు.

జహీర్ ఖాన్ , అతని భార్య సాగరిక ఘట్గే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొననున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన భార్య రితికా సజ్దేతో కలిసి జామ్ నగర్ కు చేరుకున్నాడు.

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా తన సోదరుడు క్రికెటర్ కృనాల్ పాండ్యాతో కలిసి జామ్‌నగర్ లో అడుగుపెట్టారు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి వార్తల్లో నిలుస్తోన్న వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా జామ్‌నగర్ చేరుకున్నాడు. అతనితో పాటు వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ కూడా అక్కడ కనిపించారు.

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు తన భార్యతో కలిసి జామ్‌నగర్ చేరుకున్నాడు.