- Telugu News Photo Gallery Cricket photos Indian Star Spinner Test Ravichandran Ashwin Will Play 100th Test Match In Dharamshala against engalnd 5th test
IND vs ENG: ధర్మశాలలో సరికొత్త చరిత్ర సృష్టించనున్న భారత స్పిన్ దిగ్గజం.. స్పెషల్ జాబితాలో చోటు..
Ravichandran Ashwin: ధర్మశాలలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఓ స్పెషల్ జాబితాలో చేరేందుకు రెడీ అయ్యాడు. అయితే, ఇదే టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్‌గానూ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Updated on: Mar 01, 2024 | 10:31 AM

ధర్మశాలలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో, చివరి మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్టు వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌కి 100వ టెస్టు మ్యాచ్. దీంతో అశ్విన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలు స్టాల్‌వార్ట్స్ క్లబ్‌లో చేరనున్నారు.

భారత్ తరపున 99 టెస్టు మ్యాచ్‌లు ఆడి 507 వికెట్లు తీసిన అశ్విన్.. 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 14వ భారత ఆటగాడిగా నిలిచాడు. 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ భారత్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 200 మ్యాచ్‌ల్లో 15921 పరుగులు చేశాడు.

అశ్విన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్, ఛెతేశ్వర్ పుజారా, వీరేంద్ర సెహ్వాగ్ లు భారత్ తరపున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడారు.

అంతకుముందు రాజ్‌కోట్‌లో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో 500 టెస్టు వికెట్లు పూర్తి చేసిన అశ్విన్.. అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరపున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇప్పుడు తన కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడి సరికొత్త రికార్డును లిఖించనున్నాడు.

అంతేకాదు రాంచీ టెస్టులో భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ విషయంలో మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అతడిని అధిగమించాడు. కుంబ్లే భారత్‌లో మొత్తం 63 మ్యాచ్‌లు ఆడి 350 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో 132 టెస్టుల్లో మొత్తం 619 వికెట్లు కూడా తీశాడు.

ఈ విషయంలో అనిల్ కుంబ్లేను వెనక్కి నెట్టిన ఆర్ అశ్విన్.. స్వదేశంలో ఆడిన 59వ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. దీంతోపాటు ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన ఏకైక భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.




