AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఒకప్పటి టాలీవుడ్ సెన్సెషన్.. అందాల తార..

సినీతారల వ్యక్తిగత విషయాలు.. చిన్ననాటి ఫోటోస్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతిసారి తమ అభిమాన హీరోహీరోయిన్స్ గురించి నెట్టింట సెర్చింగ్ చేస్తుంటారు. అటు సెలబ్రెటీలు కూడా తమకు ఇష్టమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటీనటుల చైల్డ్ హుడ్ ఫోటోస్, సినిమా అప్డేట్స్ తెగ వైరలవుతుంటాయి. తాజాగా ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు ఆ అమ్మాయి టాలీవుడ్ సెన్సెషన్. ఎంతోమంది […]

Tollywood: ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఒకప్పటి టాలీవుడ్ సెన్సెషన్.. అందాల తార..
Actress
Rajitha Chanti
| Edited By: |

Updated on: Mar 03, 2024 | 10:15 PM

Share

సినీతారల వ్యక్తిగత విషయాలు.. చిన్ననాటి ఫోటోస్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతిసారి తమ అభిమాన హీరోహీరోయిన్స్ గురించి నెట్టింట సెర్చింగ్ చేస్తుంటారు. అటు సెలబ్రెటీలు కూడా తమకు ఇష్టమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటీనటుల చైల్డ్ హుడ్ ఫోటోస్, సినిమా అప్డేట్స్ తెగ వైరలవుతుంటాయి. తాజాగా ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు ఆ అమ్మాయి టాలీవుడ్ సెన్సెషన్. ఎంతోమంది హృదయాలను దోచేసిన హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. కేవలం కథానాయికగానే కాకుండా.. అటు క్లాసికల్ డ్యాన్సర్‏గానూ రాణిస్తోంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. తనే సీనియర్ హీరోయిన్ శోభన. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

శోభన.. 1986లో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శోభన. ఆ తర్వాత విజృంభణ, అజేయుడు, మువ్వగోపాలుడు, అభినందన, మెగాస్టార్ చిరంజీవితో రుద్రవీణ, అల్లుడు గారు, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. కేవలం నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1994లో కళార్పణ అనే సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఎంతోమందికి భారతనాట్యంలో శిక్షణ ఇస్తుంది శోభన.

1994లో విడుదలైన మణిచిత్రతళు అనే మలయాళ సినిమాకుగానూ భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. 2001లో నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గానూ రెండవ సారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 53 సంవత్సరాలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో