Manchu Vishnu: పెళ్లిరోజున భార్యకు మంచు విష్ణు సర్‌ప్రైజ్.. విరానిక కోసం ఏకంగా హెలికాప్టర్.. వీడియో చూశారా?

శుక్రవారం (మార్చి 1) మంచు విష్ణు- విరానికల వెడ్డింగ్ యానివర్సరీ. ఈ దంపతులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు అవుతోంది. ఈ స్పెషల్ డేను పురస్కరించుకుని తన భార్యకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు హీరో మంచు విష్ణు. తన భార్యను కూడా న్యూజిలాండ్ తీసుకెళ్లిన మంచువారబ్బాయి అక్కడ

Manchu Vishnu: పెళ్లిరోజున భార్యకు మంచు విష్ణు సర్‌ప్రైజ్.. విరానిక కోసం ఏకంగా హెలికాప్టర్.. వీడియో చూశారా?
Manchu Vishnu Family
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2024 | 8:50 PM

మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉంటున్నాడు. పాన్ ఇండియ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌ ఎక్కువ భాగం న్యూజిలాండ్‌ లోనే జరుగుతోంది. దీంతో ఎక్కువగా అక్కడే ఉంటున్నాడు మంచు విష్ణు. ప్రస్తుతం కన్నప్ప సెకెండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఇదిలా ఉంటే శుక్రవారం (మార్చి 1) మంచు విష్ణు- విరానికల వెడ్డింగ్ యానివర్సరీ. ఈ దంపతులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు అవుతోంది. ఈ స్పెషల్ డేను పురస్కరించుకుని తన భార్యకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు హీరో మంచు విష్ణు. తన భార్యను కూడా న్యూజిలాండ్ తీసుకెళ్లిన మంచువారబ్బాయి అక్కడ హెలికాప్టర్ ఎక్కించి న్యూజిలాండ్ ప్రకృతి అందాలను చూపించాడు. హెలికాప్టర్ ఎక్కాక తన సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు. విష్ణు ఊహించని సర్‌ప్రైజ్‌కు ఆశ్చర్యపోయిన విరానికా భర్తకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంది విరానికా. ‘ఇలాంటి అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్‌. అస్సలు ఊహించలేదు. ఇవన్నీ బాగా ప్లాన్ చేశావు. నీతి ప్రతిరోజు ఒక అడ్వెంచర్ లా ఉంటుంది. హ్యాపీ 15 మై లవ్‌’ అంటూ తన భర్తకు విషెస్ చెప్పింది విరానిక.

ప్రస్తుతం మంచు విష్ణు, విరానికల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు విష్ణు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విష్ణు, వెరానికలు 2009 మార్చి1న ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా అరియానా, వివియానా, ఐరా, అర్వం అనే నలుగురు పిల్లలు ఉన్నారు ఈ క్యూట్ కపుల్‌కి. ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్‌, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి దిగ్గజాలు నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

భార్యను హెలికాప్టర్ దగ్గరకు తీసుకెళుతోన్న మంచు విష్ణు..

View this post on Instagram

A post shared by Viranica Manchu (@viranica)

విరానికతో మంచు విష్ణు..

View this post on Instagram

A post shared by Viranica Manchu (@viranica)

భార్య, పిల్లలతో మంచు విష్ణు..

View this post on Instagram

A post shared by Viranica Manchu (@viranica)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..