Vyooham: ‘వ్యూహం’ రిలీజ్‌ డేట్ మళ్లీ మారింది.. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’.. అంటూ ఆర్జీవీ సంచలన పోస్ట్

ఏపీ సీఎం జగన్ జీవిత కథ, ఏపీ రాజకీయాల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి క్యారెక్టర్‌లో రంగం ఫేమ్‌ అజ్మల్ అమీర్ నటించారు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న వ్యూహం సినిమా రిలీజ్‌ వాయిదా పడుతూ వస్తోంది. గతేడాది థియేటర్లలోకి రావాల్సిన ఈ పొలిటికల్ డ్రామా వివిధ కారణాలతో

Vyooham: 'వ్యూహం' రిలీజ్‌ డేట్ మళ్లీ మారింది.. 'పట్టు వదలని విక్రమార్కుడిని'.. అంటూ ఆర్జీవీ సంచలన పోస్ట్
Ram Gopal Varma Vyooham
Follow us
Basha Shek

|

Updated on: Feb 28, 2024 | 4:14 PM

ఏపీ సీఎం జగన్ జీవిత కథ, ఏపీ రాజకీయాల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి క్యారెక్టర్‌లో రంగం ఫేమ్‌ అజ్మల్ అమీర్ నటించారు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న వ్యూహం సినిమా రిలీజ్‌ వాయిదా పడుతూ వస్తోంది. గతేడాది థియేటర్లలోకి రావాల్సిన ఈ పొలిటికల్ డ్రామా వివిధ కారణాలతో పోస్ట్ పోన్ అవుతోంది. అయితే ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మార్చి1న వ్యూహం సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారింది. ఒకరోజు ఆలస్యంగా అంటే మార్చి 2న థియేటర్లలో వ్యూహం సినిమా సందడి చేయనుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు రామ్ గోపాల్ వర్మ. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అని క్యాప్షన్‌తో పాటు తన మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ని చేతిలో పట్టుకున‍్న ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వైఎస్సార్ మరణానంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను తెరకెక్కించారు ఆర్జీవీ. ధనుంజయ్ ప్రభునే, పద్మావతి, రేఖా నిరోశా తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా వ్యూహం సినిమాకు సీక్వెల్ గా శపథం సినిమాను కూడా అనౌన్స్ చేశారు వర్మ. వ్యూహం రిలీజైన వారం రోజులకే అంటే మార్చి 8న శపథం కూడా రిలీజ్ అవుతుందని ఇది వరకే ప్రకటించారు ఆర్జీవీ. అయితే ఇప్పుడు వ్యూహం ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ కానుంది. మరి శపథం రిలీజ్ డేట్ పై ఎప్పుడు అప్ డేట్ ఇస్తాడో ఆర్జీవీ.

ఇవి కూడా చదవండి

చేతిలో గన్ తో ఆర్జీవీ..

అమితాబ్ బచ్చన్ తో రామ్ గోపాల్ వర్మ, దాసరి కిరణ్ కుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు