- Telugu News Photo Gallery Cinema photos Mega Power Star Ram Charan Changer Teaser Date Update and details here Telugu Heroes Photos
Ram Charan: రామ్ చరణ్ కొంప ముంచుతున్న మొహమాటం.! ఆందోళనలో ఫ్యాన్స్.
ఇంతకీ అప్‌డేట్స్ ఇస్తారా లేదా.? గేమ్ ఛేంజర్ షూటింగ్ అవుతుందా లేదా..? అసలు జరుగుతుందా లేదంటే ఇండియన్ 2 కోసం శంకర్ పక్కన గానీ పెట్టేసారా.? ఇదిగో ఇలాంటి వైలెంట్ డౌట్స్ వస్తున్నాయిప్పుడు ఫ్యాన్స్‌కి. వాళ్ల ఫ్రస్టేషన్‌కు సమాధానం దొరికే సమయం వచ్చేసింది. గేమ్ ఛేంజర్ ఒక్కటే కాదు.. బుచ్చిబాబు సినిమా ముచ్చట్లు కూడా బయటికొస్తున్నాయి. మరి ఆ టైమ్ ఎప్పుడు.? ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఇమేజ్ క్యాష్ చేసుకోవడంలో రామ్ చరణ్..
Updated on: Feb 28, 2024 | 4:44 PM

ఇంతకీ అప్‌డేట్స్ ఇస్తారా లేదా.? గేమ్ ఛేంజర్ షూటింగ్ అవుతుందా లేదా..? అసలు జరుగుతుందా లేదంటే ఇండియన్ 2 కోసం శంకర్ పక్కన గానీ పెట్టేసారా.? ఇదిగో ఇలాంటి వైలెంట్ డౌట్స్ వస్తున్నాయిప్పుడు ఫ్యాన్స్‌కి. వాళ్ల ఫ్రస్టేషన్‌కు సమాధానం దొరికే సమయం వచ్చేసింది.

గేమ్ ఛేంజర్ ఒక్కటే కాదు.. బుచ్చిబాబు సినిమా ముచ్చట్లు కూడా బయటికొస్తున్నాయి. మరి ఆ టైమ్ ఎప్పుడు.? ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఇమేజ్ క్యాష్ చేసుకోవడంలో రామ్ చరణ్ వెనక బడ్డారంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

రాజమౌళి సినిమా వచ్చిన ఏడాదిలోపే కనీసం మరో సినిమా వచ్చుంటే బాగుండేదని.. కానీ గేమ్ ఛేంజర్ ఆలస్యంతో చరణ్‌కు మళ్లీ లాంగ్ బ్రేక్ తప్పట్లేదు. ఈ విషయంలోనే దర్శకుడు శంకర్‌పై కోపంగా ఉన్నారు ఫ్యాన్స్. గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ చెప్పాలంటూ శంకర్‌ను సోషల్ మీడియాలో అడుగుతూనే ఉన్నారు ఫ్యాన్స్.

సినిమాపై వస్తున్న గాసిప్స్‌కు స్వయంగా శంకర్ ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఇండియన్ 2పై ఫోకస్ చేస్తూ.. గేమ్ ఛేంజర్‌ను పట్టించుకోవట్లేదంటూ వార్తలొస్తున్న తరుణంలో.. ఈ మధ్యే చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు శంకర్.

RFCలోనే లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటు మెయిన్ టీం అందరిపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు శంకర్. ఇక త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఇండియన్ 2 షూట్ చివరికి వచ్చేయడం గేమ్ ఛేంజర్‌కు కలిసొచ్చే విషయం. అందుకే చరణ్ సినిమాతో బిజీ అవుతున్నారు శంకర్. గేమ్ ఛేంజర్ టీజర్ మార్చ్ 27న విడుదల చేయనున్నారు మేకర్స్. ఆ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు.

అందుకే టీజర్‌తో పాటు అదేరోజు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేయనున్నారు శంకర్. అంతేకాదు.. బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ సైతం మార్చ్ 27నే రానున్నాయి. మొత్తానికి ఈ సారి చరణ్ బర్త్ డే మోస్ట్ స్పెషల్‌గా మారబోతుందన్నమాట.




