Save The Tigers 2 OTT : ‘సేవ్ ది టైగర్స్’ రెండో సీజన్ రిలీజ్ డేట్ ఇదే..ఫ్రీగా సీజన్ వన్ స్ట్రీమింగ్ .. ఎక్కడంటే?

ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌ఠం, చైత‌న్య కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. భార్యల చేతిల్లో నలిగిపోతున్న భర్తల బాధలు ఎలా ఉంటాయో చూపిస్తూ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. యాత్ర సిరీస్ సినిమాల డైరెక్టర్ మహి.వి.రాఘవ్‌ ఈ సిరీస్ కు క్రియేటర్ గా వ్యవహరించం విశేషం.

Save The Tigers 2 OTT : 'సేవ్ ది టైగర్స్' రెండో సీజన్ రిలీజ్ డేట్ ఇదే..ఫ్రీగా సీజన్ వన్ స్ట్రీమింగ్ .. ఎక్కడంటే?
Save The Tigers Season 2
Follow us
Basha Shek

|

Updated on: Feb 28, 2024 | 3:47 PM

ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌ఠం, చైత‌న్య కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. భార్యల చేతిల్లో నలిగిపోతున్న భర్తల బాధలు ఎలా ఉంటాయో చూపిస్తూ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. యాత్ర సిరీస్ సినిమాల డైరెక్టర్ మహి.వి.రాఘవ్‌ ఈ సిరీస్ కు క్రియేటర్ గా వ్యవహరించం విశేషం. తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. గతడాది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన సేవ్ ది టైగర్స్ ఆడియెన్స్ ను కడపుబ్బా నవ్వించింది. సాధారణంగా వెబ్ సిరీసులంటే అసభ్యకర డైలాగులు, సీన్లు ఉంటాయి. అయితే ఇందులో అలాంటివేవీ లేవు. క్లీన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ కు ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మొదటి సీజన్ ఎండింగ్ లోనే సీక్వెల్ ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సేవ్ ది టైగర్స్ సెకెండ్ సీజన్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా సిరీస్ స్ట్రీమింగ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. మార్చి 10 వ‌ర‌కు సేవ్ ది టైగర్స్ సీజ‌న్ వ‌న్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ చేయ‌నున్నట్లు వెల్ల‌డించారు. అంటే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ స‌బ్‌స్కైబ‌ర్లు అంద‌రూ ఉచితంగా ఈ సిరీస్‌ను చూడొచ్చు. అంటే సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 2 మార్చి 10 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.

సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్‌లో ర్దార్ సుజాత‌, పావ‌ని గంగిరెడ్డి, దేవ‌యాని, హర్ష వర్దన్‌, శ్రీకాంత్ అయ్యాంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ హీరోయిన్ మిస్సింగ్ కేసులో ప్రియదర్శి, అభివన్ లను పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో సెకండ్ సీజ‌న్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం. వారు ముగ్గురు జైలు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు అనే క‌థ‌తో సెకండ్ సీజ‌న్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

టైగర్స్ ఈజ్ బ్యాక్‌..

మార్చి 10 వరకు సీజన్ వన్ ఫ్రీగా స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు