Devil OTT: రెండు ఓటీటీల్లో పూర్ణ లేటెస్ట్ హారర్ మూవీ.. డెవిల్ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

ప్రస్తుతం టీవీ షోల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది పూర్ణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ హార్రర్ చిత్రం డెవిల్. ప్రముఖ డైరెక్టర్ మిస్కిన్ సోదరుడు ఆథియా తెరకెక్కించిన ఈ సినిమాలో త్రిగుణ్‌, విదార్థ్‌ కీలక పాత్రలు పోషించారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు మరో పాత్రలో మెరిసింది

Devil OTT: రెండు ఓటీటీల్లో పూర్ణ లేటెస్ట్ హారర్ మూవీ.. డెవిల్ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Devil Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 28, 2024 | 1:55 PM

గతంలో హీరోయిన్‌గా పలు తెలుగు సినిమాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం స్పెషల్ రోల్స్ తో అలరిస్తోంది. ఇటీవల మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ లో కిర్రాక్ స్టెప్పులేసిందీ అందాల తార.ప్రస్తుతం టీవీ షోల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది పూర్ణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ హార్రర్ చిత్రం డెవిల్. ప్రముఖ డైరెక్టర్ మిస్కిన్ సోదరుడు ఆథియా తెరకెక్కించిన ఈ సినిమాలో త్రిగుణ్‌, విదార్థ్‌ కీలక పాత్రలు పోషించారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు మరో పాత్రలో మెరిసింది. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన డెవిల్ ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మిస్కిన్ సోదరుడు అన్న క్రేజ్ తో భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. బిగ్ స్క్రీన్ పై ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైన డెవిల్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. నెల తిరగకుండానే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు టెంట్ కోటాలోనూ డెవిల్‌ స్ట్రీమింగ్ అవ్వనుంది.రిలీజ్ డేట్ పై ఖచ్చితమైన సమాచారం లేదు కానీ మార్చి 1 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ డెవిల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

డెవిల్ సినిమా కథ విషయానికొస్తే.. హేమ(పూర్ణ) అలెక్స్ అనే పేరున్న లాయర్ ను వివాహం చేసుకుంటుంది. అయితే అతను తన ఆఫీస్‌లోనే ప‌నిచేసే సోఫియా(శుభశ్రీ)తో రిలేష‌న్‌షిప్‌లో ఉంటాడు. ఓరోజు యాక్సిడెంట్ ద్వారా హేమ జీవితంలోకి రోష‌న్(త్రిగుణ్) వ‌స్తాడు. దీంతో హేమ జీవితం పలు మలుపులు తిరుగుతుంది. రోష‌న్‌, హేమ‌ల బంధం గురించి తెలిసిన అలెక్స్ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే డెవిల్ సినిమా కథ. ఇందులో పూర్ణ నటన బాగానే ఉన్నా రోటిన్ కథ కావడంతో థియేటర్లలో తలిపోయింది. అయితే ఓటీటీలో టైం పాస్ కోసం చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

రెండు ఓటీటీల్లోనూ పూర్ణ సినిమా..

మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన డైరెక్టర్ మిస్కిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి