Game On OTT: నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. ‘గేమ్ ఆన్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గతంలో బ్లూ వేల్ అనే ఆన్ లైన్ గేమ్ కు బానిసై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీనినే కథా నేపథ్యంగా తీసుకుని అటూ ఇటూ మార్చి తెరకెక్కించిన చిత్రం గేమ్ ఆన్‌. గీతానంద్, నేహా సోలంకి హీరో, హీరోయిన్లుగా నటించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు

Game On OTT: నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. 'గేమ్ ఆన్' స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Game On Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 27, 2024 | 6:38 PM

గతంలో బ్లూ వేల్ అనే ఆన్ లైన్ గేమ్ కు బానిసై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీనినే కథా నేపథ్యంగా తీసుకుని అటూ ఇటూ మార్చి తెరకెక్కించిన చిత్రం గేమ్ ఆన్‌. గీతానంద్, నేహా సోలంకి హీరో, హీరోయిన్లుగా నటించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఫిబ్రవరి 2 న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.కథా, కథనాలు ఆసక్తి కరంగానే ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ నటీనటులు లేకపోవడం గేమ్ ఆన్ సినిమాకు మైనస్ గా మారిపోయింది. ప్రమోషన్లు కూడా పెద్దగా నిర్వహించకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయిందీ సినిమా. అయితే గేమ్ ఆన్ సినిమా నెల తిరగకుండానే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సైలెంట్‌ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రస్తుతం గేమ్ ఆన్ స్ట్రీమింగ్‌ అవుతోంది.

‘గేమ్ ఆన్’ సినిమా కథేంటంటే..

‘గేమ్ ఆన్’ సినిమా కథ విషయానికొస్తే.. గౌతమ్ (గీతానంద్) ఓ ఆన్ లైన్ గేమింగ్ సంస్థలో పనిచేస్తుంటాడు. మోక్ష (వాసంతి) ను ప్రేమిస్తాడు. అయితే టార్గెట్ పూర్తి చేయకపోవడంతో గౌతమ్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తారు. దీంతో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా ఇదే సమయంలో అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. చిన్న చిన్న టాస్కులు ఇస్తూ వాటిని పూర్తి చేస్తుంటే.. గౌతమ్ అకౌంట్‌లో సదరు అజ్ఞాత వ్యక్తి డబ్బులేస్తుంటారు. ఆఖరికి ఓ వ్యక్తిని చంపాలని టాస్క్ ఇస్తాడు. మరి గౌతమ్ ఈ టాస్క్‌ను స్వీకరించాడా? అసలు ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనేది తెలుసుకోవాలంటే గేమ్ ఆన్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

‘గేమ్ ఆన్’ ట్రైలర్.. ఇదిగో..

‘గేమ్ ఆన్’ సినిమాలో గీతా నంద్, నేహా సోలంకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు