- Telugu News Photo Gallery Cinema photos Rakul Preet Singh Shares Mehandi Photos From Her Marriage With Jackky Bhagnani
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మెహెందీ ఫొటోలు వచ్చేశాయ్..ఎలా మెరిసిపోతున్నారో చూశారా?
టాలీవుడ్ ప్రముఖ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంతోషకరమైన క్షణానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు రకుల్- జాకీ దంపతులు. ఇప్పుడు తాజాగా తమ మెహెందీ ఫంక్షన్ ఫొటోలను తమ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారీ క్యూట్ కపుల్.
Updated on: Feb 27, 2024 | 4:46 PM

.టాలీవుడ్ ప్రముఖ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంతోషకరమైన క్షణానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు రకుల్- జాకీ దంపతులు. ఇప్పుడు తాజాగా తమ మెహెందీ ఫంక్షన్ ఫొటోలను తమ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారీ క్యూట్ కపుల్.

పెళ్లిరోజు ముందు మెహెందీ కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రీ వెడ్డింగ్ ఫెస్టివల్ కోసం, డిజైనర్ అర్పితా మెహతా రూపొందించిన దుస్తులను రకుల్ ధరించింది.

ఈ సందర్భంగా నారింజ, ఎరుపు రంగు కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ చేసిన డ్రెస్ లో తళుక్కుమంది రకుల్. ఇక జాకీ కూడా పింక్ అండ్ రెడ్ కలర్ కాంబో డ్రెస్ లో ముస్తాబయ్యాడు.

మ్యాచింగ్ ష్రగ్, మినిమల్ మేకప్ రకుల్ అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ప్రస్తుతం రకుల్, జాకీల మెహెందీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైర ల్ గా మారాయి.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీల వివాహ వేడుక ఫిబ్రవరి 21న గోవా వేదికగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారీ ప్రేమ పక్షులు. ఇప్పటికీ రకుల్ పెళ్లి ఫొటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.




