- Telugu News Photo Gallery Cinema photos Some medium range heroes in the industry are waiting for a Solid hit
Telugu Heroes: కొన్నేళ్లుగా నోచుకోని హిట్స్.. ఈసారైనా ఫలించేనా.?
పదవిలో లేని రాజకీయ నాయకుడిని.. ఫ్లాపుల్లో ఉన్న హీరోలని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అందుకే వాళ్లకు పదవైనా.. వీళ్ళకు హిట్టైనా ఇంపార్టెంట్ అంతే. కానీ ఏం చేస్తాం.. ఇండస్ట్రీలో కొందరు మీడియం రేంజ్ హీరోలకు హిట్ అందని ద్రాక్షలా మారింది. కొన్నేళ్లుగా దండయాత్ర చేస్తున్నా.. ఫలితం మాత్రం శూన్యం. మరి వాళ్లెవరు.. ఏ సినిమాలతో వస్తున్నారో చూద్దాం..?
Updated on: Feb 27, 2024 | 4:29 PM

కనిపించట్లేదు కానీ.. టాలీవుడ్‌లో చాలా మంది మీడియం రేంజ్ హీరోలు హిట్టు కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. గోపీచంద్, నాగ చైతన్య, అఖిల్, శర్వానంద్, నితిన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా భారీగానే ఉంటుంది. వీళ్లంతా హిట్ కొట్టి కొన్నేళ్ళవుతుంది. అందరూ నెక్ట్స్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయాలని చూస్తున్నారు.

నాగ చైతన్యనే తీసుకోండి.. లవ్ స్టోరీ తర్వాత ఈయనకు సక్సెస్ లేదు. థ్యాంక్యూ, కస్టడీ దారుణంగా నిరాశ పరిచాయి. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్‌పైనే చైతూ ఆశలన్నీ ఉన్నాయి.

గోపీచంద్ హిట్ కొట్టి దశాబ్ధం అవుతుంది. లౌక్యం తర్వాత ఈయనకు హిట్ లేదు. మార్చ్ 8న భీమాతో వస్తున్న ఈయన.. నెక్ట్స్ శ్రీను వైట్ల సినిమాను లైన్‌లో పెట్టారు. గోపీచంద్ కి భీమా సినిమా కీలకం. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నారు.

శర్వానంద్ సైతం కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకే ఒక జీవితం ఓకే అనిపించినా బ్లాక్‌బస్టర్ కాదు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తున్నారు శర్వా. ఈ సినిమా హిట్ శర్వాకి చాల ముఖ్యం.

అలాగే నితిన్, అఖిల్, కళ్యాణ్ రామ్, రవితేజ, రామ్ లాంటి హీరోలు సైతం ఒక్క హిట్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నారు. వీళ్లందరూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేదెప్పుడో చూడాలి. వీరి తర్వాతి తర్వాతి చిత్రంపైనే అందరు అసలు పెట్టుకున్నారు.




